ఒకసారి పాజిటివ్‌గా... మరోసారి నెగిటివ్‌గా... ఇలా ఒక్కోసారి ఒక్కో విధంగా రావడంతో వైద్య నిపుణులకూ ఏం చేయాలో పాలుపోవడం లేదు. కొందరిలో కరోనా లక్షణాలున్నా పరీక్షల్లో నెగిటివ్ రావడం... మరికొందరిలో అసలు లక్షణాలే లేకున్నా మహమ్మారి బయట పడడం... ఇలా కరోనా తన వింత స్వభావంతో శాస్త్ర సాంకేతికతకే సవాల్ విసురుతోంది.
వ్యాధి ఉన్నా లేనట్లు రావడం...
వైద్య పరిభాషలో ‘ఫాల్స్ నెగిటివ్’ అంటే వ్యాధి ఉన్నా లేనట్లు రావడం. ఓ రకంగా చెప్పాలంటే వైరస్ శరీరంలో ఏదో మూలన ఉండీ దొరక్కుండా దాక్కోవడం. ఇప్పడు ఇదే ప్రపంచానికి ప్రమాదకరంగా పరిణమించింది. వైరస్‌ను గుర్తించడమే అత్యంత కీలకమని వైద్యనిపుణులు ముక్తకంఠంతో చెబుతున్న తరుణంలో కరోనా స్వభావం అంతుచిక్కకుండా ఉంది. ఇప్పటికే ఆ మహమ్మారి నుంచి బయటపడినవారు మళ్లీ కరోనా కోరల్లో చిక్కుకునే ప్రమాదముందన్న దానిపై జరుగుతున్న అధ్యయనాలు ఆందోళన రెకెత్తిస్తున్నాయి. ఫాల్స్ నెగిటివ్‌పై జరుగుతున్న పరిశోధనలు వెలుగులోకి వస్తుండడం పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండీ... టిక్‌టాక్‌లో మాస్కులపై సెటైర్- ఆ వ్యక్తికే కరోనా