ETV Bharat / city

తెలంగాణ: కుటుంబాన్ని బలి తీసుకున్న కరోనా - FAMILY DEATH CORONA

ఒకే శాఖలో పనిచేసే వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వారి ప్రేమకు గుర్తుగా త్వరలో వాళ్లింట్లోకి మరో బుజ్జాయి రాబోతుండటంతో ఆ జంటతో పాటు ఇంటి పెద్దల్లో సంతోషం రెట్టింపైంది. కానీ కరోనా వారి సంతోషాన్ని చిదిమేసింది. కొద్ది రోజుల తేడాలోనే అత్తమామలను, భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంలో మునిగిపోయింది ఓ నిండు గర్భిణి.

family died with carona in warangal
తెలంగాణ: కుటుంబాన్ని బలి తీసుకున్న కరోనా
author img

By

Published : Jul 18, 2020, 6:13 PM IST

తెలంగాణలోని వరంగల్‌ నగరంలో... ఓ కార్యాలయంలో పనిచేసే యువతి తన సహోద్యోగినే ప్రేమించి పెళ్లి చేసుకుంది. తీవ్ర జ్వరం, కరోనా లక్షణాలు కనిపించిన కారణంగా.. పరీక్షలు చేయించుకోగా ఆమె భర్తకు ఈనెల 2న పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొదట వరంగల్‌ ఎంజీఎంలో చికిత్స పొందిన అతన్ని తర్వాత హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అంతలోనే ఆమె మామకు కరోనా సోకింది. వరంగల్‌లోని ఎంజీఎంలో చేర్చగా చికిత్స పొందుతూ గత శుక్రవారం ఆయన ప్రాణాలొదిలారు. భర్త మృతిని తట్టుకోలేని ఆమె అత్తమ్మ... ఒకరోజు వ్యవధిలోనే ఆదివారం కన్నుమూసింది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్న భర్త పరిస్థితి విషమించి.. గురువారం తుది శ్వాస వదిలాడు. కడుపులో బిడ్డను చూడకుండానే వారం వ్యవధిలోనే అటు అత్తమామలు, ఇటు భర్త చనిపోవటం.. ఆమెకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.