ETV Bharat / city

18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌: జగన్

ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌
ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌
author img

By

Published : Apr 23, 2021, 5:23 PM IST

Updated : Apr 24, 2021, 4:42 AM IST

17:20 April 23

రాష్ట్రంలో 18 ఏళ్లు దాటిన అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ఇస్తామని సీఎం జగన్‌ ప్రకటించారు. 18 - 45 మధ్య ఉన్నవారికి ఉచితంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో 2 కోట్ల 4 లక్షల మందికి పైగా కొవిడి ఉచిత టీకా ఇవ్వనున్నట్టు స్పష్టం చేశారు. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

రాష్ట్రంలో 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు వారికి కరోనా టీకా ఉచితంగా ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు సుమారు రూ.1600 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా. ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటికే 45, ఆపై వయసున్న వారందరికీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగానే టీకాలు వేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మే 1వ తేదీ నుంచి 18-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి సైతం వ్యాక్సినేషన్‌ చేయాలని నిర్ణయించింది. 

నేటి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ 

         ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఈ గ్రూపు వయస్కులు 2,04,70,364 మంది ఉన్నారని, వారందరికీ అవసరమైన టీకాల కోసం కంపెనీలకు ఆర్డర్‌ పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. సమీక్ష సమావేశంలో సీఎం ప్రకటించిన నిర్ణయాలు, సమావేశం అనంతరం ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌(నాని) విలేకరుల సమావేశంలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి... దావానలంలా వ్యాపిస్తున్న కరోనాను కట్టడి చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా శనివారం నుంచి రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేయనున్నారు. రోజూ రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 5గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు పది, ఇంటర్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షలను యథావిధిగా నిర్వహించాలని సీఎం ఆదేశించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని స్పష్టంచేశారు.

రెమిడెసివిర్‌ బ్లాక్‌మార్కెట్‌ని అడ్డుకోండి
రాత్రిపూట కర్ఫ్యూ సమయంలో రెస్టారెంట్లు సహా అన్నీ మూసేయాలని సీఎం ఆదేశించారు. రైతు బజార్లను వికేంద్రీకరించాలని, ప్రత్యేక మొబైల్‌ రైతుల బజార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఔషధాల బ్లాక్‌మార్కెట్‌ని నిరోధించాలని, దీని వెనుక ఏదైనా రాకెట్‌ ఉందని తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టంచేశారు. ‘‘ఆక్సిజన్‌ ఉత్పత్తితోపాటు సరఫరాను హేతుబద్ధీకరించండి. రెమిడెసివిర్‌ ఇంజెక్షన్ల కేటాయింపు, సరఫరాను ఎప్పటికప్పుడు సమీక్షించండి. ఈ ఔషధం బ్లాక్‌మార్కెట్‌లోకి వెళ్లకుండా చూడండి. ప్రత్యేక ప్రామాణిక నిర్వహణ విధానం రూపొందించండి’’ అని సీఎం ఆదేశించారు.

ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు
‘‘కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను అవసరం మేరకు పెంచండి. కోవిడ్‌ రోగుల ప్రైమరీ కాంటాక్టులతోపాటు కోరినవారందరికీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలి. కొవిడ్‌ చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రులపై కఠిన చర్యలు తీసుకోండి. అవసరమైతే దాడులు చేయండి. ఒక సీనియర్‌ అధికారిని ప్రత్యేకంగా నియమించండి’’ అని సీఎం స్పష్టంచేశారు. ‘‘104 కాల్‌ సెంటర్‌ సమర్థంగా పనిచేయాలి. సాయం కోరుతూ చేసే ప్రతి ఫోన్‌ కాల్‌కీ స్పందించి, మూడు గంటల్లోనే బెడ్‌ కేటాయించాలి. జిల్లాల్లో 104 కాల్‌సెంటర్‌కు ఇన్‌ఛార్జిగా ఒక జేసీని కేటాయించండి. తగిన సదుపాయాలతో అవసరమైనన్ని కొవిడ్‌ కేర్‌ సెంటర్లు ఏర్పాటు చేయండి’’ అని సీఎం ఆదేశించారు. ఇదీ చదవండీ... కరోనా కంట్రోల్: సీఎం సహాయనిధికి పలు సంస్థలు విరాళం

ఆక్సిజన్‌ సరఫరాకు తగినన్ని వాహనాల్లేవు!
సరైన రవాణా సదుపాయం లేక ఆక్సిజన్‌ సరఫరాలో జాప్యం జరుగుతోందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌ సరఫరాకు 64 వాహనాలే కేటాయించారని, ప్రస్తుత డిమాండుని తట్టుకోవాలంటే కనీసం 100 నుంచి 120 వాహనాలు కావాలని కోరారు. రాష్ట్రంలో అన్ని ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌ బెడ్‌లు రోగులతో నిండిపోతే రోజుకి 515 టన్నుల ఆక్సిజన్‌ అవసరమవుతుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకి సగటున 284 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగిస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ ఉక్కు కర్మాగారంలో రోజుకి వంద టన్నుల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసి, దాన్ని పూర్తిగా మన రాష్ట్రానికే ఇవ్వడంతోపాటు తమిళనాడు, కర్ణాటకల నుంచి కూడా ఆక్సిజన్‌ సరఫరా పెంచాలని కేంద్రానికి విన్నవించినట్లు అధికారులు వివరించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 208 కొవిడ్‌ ఆస్పత్రులలో మొత్తం 21,581 బెడ్‌లు ఉండగా, వాటిలో 11,789 నిండిపోయాయని, 24 గంటల వ్యవధిలోనే 2,506 మంది కొత్తగా చేరినట్లు తెలిపారు. సమీక్షా సమావేశంలో ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్‌తోపాటు మంత్రులు బొత్స సత్యనారాయణ, కన్నబాబు, సుచరిత తదితరులు పాల్గొన్నారు.

కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా కల్యాణ మండపాలు
కల్యాణ మండపాలను కొవిడ్‌ కేర్‌ సెంటర్లుగా మార్చాలని, ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని, వైద్యులు, సిబ్బంది నియామకాన్ని త్వరగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి విలేకరుల సమావేశంలో తెలిపారు. కరోనా చికిత్సకు అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల రిజిస్ట్రేషన్‌ రద్దు చేయడానికీ వెనుకాడబోమని ఆయన స్పష్టంచేశారు. సీటీ స్కాన్‌ సెంటర్లు కూడా అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇదివరకు సీటీ స్కాన్‌కి రూ.2,500 వరకు ధర నిర్ణయించామని, దాన్ని కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సీఎం ఆదేశించారని వివరించారు.

అదనపు డోసులు సరఫరా చేయాలి
భారత్‌ బయోటెక్‌ను కోరిన సీఎం జగన్‌
రెమ్‌డెసివిర్‌ కోసం హెటిరోతో సంప్రదింపులు

ఈనాడు, అమరావతి: రాష్ట్ర అవసరాలకు సరిపడా కొవిడ్‌ వ్యాక్సిన్‌ డోసులను సరఫరా చేయాలని భారత్‌ బయోటెక్‌ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శుక్రవారం భారత్‌ బయోటెక్‌ ఇంటర్నేషనల్‌ సీఎండీ కృష్ణ ఎల్లతో సీఎం ఫోన్‌లో మాట్లాడారు. మరోవైపు కరోనా చికిత్సకు వినియోగిస్తున్న రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లను అదనంగా సరఫరా చేయాలని హెటిరో ఎండీ పార్థసారథిని సీఎం ఫోన్‌లో కోరారు.

ఇదీ చదవండీ... 'అక్కాచెల్లెమ్మలు బాగుంటేనే కుటుంబం బాగుంటుంది'

Last Updated : Apr 24, 2021, 4:42 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.