తెలంగాణలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే 30 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో జరిగిన సమీక్షలో అధికారులు వెల్లడించారు. కరోనాతో ముగ్గురు మృతిచెందినట్లు తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 127కు కరోనా కేసులు పెరిగాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు కరోనాతో 9 మంది మృతి చెందారు. చనిపోయిన ముగ్గురు కూడా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారిగానే తేలింది. గతంలో మరణించిన వారిలోనూ ఎక్కువగా మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారే.
మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వారిలో కొంతమందికి, వారి ద్వారా మరి కొంత మందికి వైరస్ సోకింది. వారంతా క్రమంగా కోలుకుంటున్నారు. వారిలో చాలా మంది డిశ్చార్జి కూడా అయ్యారు. అలాంటి వారిలో ఎవరి పరిస్థితి కూడా ఆందోళన కరంగా లేదు. ఎవరూ చనిపోలేదు. అయితే గత కొద్ది రోజులుగా తెలంగాణలో నమోదవుతన్న పాజిటివ్ కేసులన్నీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన వారివిగానే తేలాయి. రాష్ట్ర ప్రభుత్వం మర్కజ్ వెళ్లి వచ్చిన వారందరికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది.
ఇదీ చూడండి: