తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన బాలింత.. కరోనాతో మృతి చెందింది. వైద్య పరీక్షల నిమిత్తం సోమవారం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్టు అధికారులు వెల్లడించారు.
ఆ మహిళ ఇంటి సమీప పరిసరాలను, కాలనీలను కంటైన్మెంట్ జోన్‌గా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. ప్రజలు రాకపోకలు చేయకుండా కర్ఫ్యూ విధించారు. మృతురాలి ప్రైమరీ కాంటాక్ట్స్‌ను సుమారు 13 మందిని గుర్తించి హోమ్ క్వారంటైన్ విధించారు.
ఇవీ చూడండి: