ETV Bharat / city

మూడోసారి విజృంభిస్తే.. 4.50 లక్షల మంది పిల్లలకు వైరస్‌!

కరోనా మూడో దశ అనివార్యమైతే రాష్ట్రంలో 18 లక్షల మంది వైరస్‌ బారినపడవచ్చని అంచనా వేస్తున్నారు. తొలి, రెండో విడతలో కంటే తీవ్రస్థాయిలో వైరస్‌ వ్యాప్తి జరిగితేనే ఈ స్థాయిలో కేసులు వస్తాయని అంచనా వేసినట్లు కొవిడ్‌-19 పీడియాట్రిక్స్‌ స్పెషల్‌ టాస్క్‌ఫోర్సు కమిటీ ఛైర్మన్‌ డాక్టర్‌ చంద్రశేఖరరెడ్డి వెల్లడించారు.

మూడోసారి విజృంభిస్తే.. 4.50 లక్షల మంది పిల్లలకు వైరస్‌!
మూడోసారి విజృంభిస్తే.. 4.50 లక్షల మంది పిల్లలకు వైరస్‌!
author img

By

Published : Jun 8, 2021, 6:46 AM IST

కొవిడ్ మూడో దశ అనివార్యమైతే రాష్ట్రంలో 18 లక్షల మంది వైరస్ బారిన పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. 'ఈ 18 లక్షల మందిలో 18 ఏళ్లలోపు పిల్లలు 4.50 లక్షల మంది ఉంటారు. వీరిలో 4.05 లక్షల మంది ఇళ్లల్లోనే ఉండి చికిత్స పొందుతారు. మధ్యస్థ లక్షణాలతో 36వేల(8%) మంది ఆసుపత్రుల్లో చేరతారు. వీరిలోనూ 9,000(2%) మంది ఐసీయూలో చికిత్స పొందుతారు. మూడో వేవ్‌ ఉంటుందా? లేదా? అన్న దాని గురించి స్పష్టత లేదు. సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ముందస్తు జాగ్రత్తగా పిల్లలకు తగిన వైద్యం అందించేందుకు వీలుగా ఆసుపత్రుల్లో సౌకర్యాలు పెంచుకోవాల్సిన అవసరం ఉంది.' అని పేర్కొన్నారు.

మూడోసారి విజృంభిస్తే.. 4.50 లక్షల మంది పిల్లలకు వైరస్‌!
మూడోసారి విజృంభిస్తే.. 4.50 లక్షల మంది పిల్లలకు వైరస్‌!

మూడో వేవ్‌ ఉంటుందన్న హెచ్చరికల నేపథ్యంలో పిల్లలు ఏ స్థాయిలో వైరస్‌ బారినపడవచ్చునన్న దానిపై కొవిడ్‌ పీడియాట్రిక్స్‌ టాస్క్‌ఫోర్సు కమిటీ విశ్లేషణ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు కోటిన్నర మంది 18 ఏళ్లలోపు వారు ఉన్నారు. వైరస్‌ ఉద్ధృతి పెరిగే 30 రోజుల్లో 75% మంది పిల్లలకు సంక్రమిస్తుందని పేర్కొంది. రోజుకి 1,100 మంది ఆసుపత్రుల్లో చేరే అవకాశం ఉంటుంది.

38 రకాల మందుల అవసరం

పిల్లల ఆరోగ్య పరిస్థితి అనుసరించి రెమ్‌డెసివిర్‌, ఆంపోటెరిసిన్‌ ఇంజెక్షన్లు, ముఖ్యమైన సిరప్స్‌తో కలిపి మొత్తం 38 రకాల మందులు సిద్ధం చేయాలని కమిటీ ప్రభుత్వానికి నివేదించింది. 2 రకాల పరిమాణాల్లో ఆక్సిజన్‌ మాస్కులు, వెయింగ్‌ మిషన్లు, థర్మామీటర్లు, ఇతర వైద్య పరికరాలు ఏమేమి అవసరం అవుతాయన్నదీ వివరించింది. వీటిల్లో ఇప్పటికే 70% నుంచి 80% వరకు వైద్య ఆరోగ్యశాఖ వద్ద అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వంద వెంటిలేటర్లు కొనుగోలు చేయడంతో పాటు అదనంగా నర్సులను నియమించే అవకాశం ఉంది.

ముఖ్యంగా ఖరీదైన ఇమ్యూనోగ్లోబులిన్‌ ఇంజెక్షన్లను తీవ్రత ఎక్కువగా ఉన్న చిన్నపిల్లలకు ఇస్తారు. 5ఎంజీ ధర రూ.13,000 వరకు ఉంది. కనీసం 5 ఇంజెక్షన్లను వాడాల్సి వస్తుంది. కొన్ని ఇంజెక్షన్లు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ వద్ద ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర స్థాయిలో వయసుల వారీగా ఇప్పటివరకు నమోదైన కరోనా వైరస్‌ కేసుల శాతం ఇంచుమించు ఒకేలా ఉంది. వైరస్‌ సోకిన 20 ఏళ్లలోపు వారు జాతీయ స్థాయిలో 11.73% మంది ఉన్నారు. రాష్ట్రంలో వీరి సంఖ్య 11.07%గా నమోదైంది.

ఇదీ చదవండి:

Anandaiah Medicine:'ఆనందయ్య మందు' పంపిణీ ప్రారంభమైంది.. ఎక్కడంటే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.