ETV Bharat / city

తెలంగాణ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి కరోనా పాజిటివ్​ - Bhuvanagiri MP Latest News

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి తనకు కరోనా సోకినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కొవిడ్​ లక్షణాలు లేవని... ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు.

MP komatireddy venkatareddy
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి
author img

By

Published : Oct 23, 2020, 2:47 PM IST

తెలంగాణలోని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్​రెడ్డికి కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయింది. తనకు వైరస్ సోకినట్లు ఓ ప్రకటనలో వెల్లడించారు. ప్రస్తుతం తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని... సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉన్నట్లు పేర్కొన్నారు. కాంగ్రెస్​ కార్యకర్తలు, అభిమానులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇటీవల తనను కలిసిన వారంతా కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు.

ప్రస్తుతం దుబ్బాక ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్​పార్టీ తనకు అప్పగించిన దౌల్తాబాద్​ మండల బాధ్యతలను సెల్ఫ్​ ఐసోలేషన్​లో ఉండే పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. దుబ్బాకలో ప్రజలు తెరాస ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. తెరాస ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్​ విజయానికి దోహదం చేస్తాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: దేశంలో 7 లక్షల దిగువకు క్రియాశీల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.