తెలంగాణలో కరోనా పంజా విసురుతోంది. తాజాగా యాదాద్రి ఆలయంలోని 30 మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది. సిబ్బందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధరణ కావడం వల్ల ఆలయంలో స్వామివారి పూజలకు ఆంటంకం కలగనుంది. రేపు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున.. ఆర్జిత సేవలను రేపటి నుంచి మూడు రోజుల పాటు నిలిపేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
ఆలయ ఉద్యోగులతో పాటు యాదగిరిగుట్ట మండలం మల్లాపురంలో 16 మందికి కొవిడ్ సోకగా.. మండలంలో మొత్తం 48 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో లాక్డౌన్ అమలుచేయమని స్పష్టం చేసిన ప్రభుత్వం.. కొవిడ్ నుంచి తప్పించుకోవాలంటే మాస్కులు ధరించడం, భౌతికదూరం కచ్చితంగా పాటించాలని సూచించింది.
ఇదీ చదవండి: