ETV Bharat / city

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజురోజుకు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రవ్యాప్తంగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో... దాదాపు మూడు వంతుల మంది బాధితులు జీహెచ్​ఎంసీ పరిధిలోనే ఉంటున్నారు. పెరుగుతున్న కేసుల్లో క్యాబ్ డ్రైవర్‌లు మొదలుకుని ఉన్నతస్థాయి అధికారుల వరకు మహమ్మారి బారిన పడుతున్నారు. లక్షణాలు ఉంటే వెంటనే వెళ్లి పరీక్షల చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

corona-positive-cases-increase-in-hyderabad-city
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వేగంగా విస్తరిస్తోన్న కరోనా
author img

By

Published : Jun 19, 2020, 4:40 PM IST

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. బుధవారం బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో అధికారులకు కరోనా నిర్ధారణ కాగా... తాజాగా ఎస్సార్​ నగర్‌ పోలీస్‌స్టేషనలో ఇద్దరు కానిస్టేబుళ్లకు వైరస్‌ సోకినట్లు నిర్ధారించి, ప్రకృతి వైద్యాఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సరోజినీదేవి కంటి ఆసుపత్రిలోనూ కోరనా వెలుగు చూసినట్టు అధికారులు నిర్ధారించారు. పటాన్‌చెరులోని ఏషియన్ పెయింట్స్ పరిశ్రమలో కార్మికుడికి, అంబేద్కర్ కాలనీలో ఓ క్యాన్సర్ రోగికి కరోనా సోకినట్టు సమాచారం.

అంబర్‌పేట నియోజకవర్గ పరిధిలో తాజాగా 8మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. బాగ్ అంబర్‌పేట్‌, నల్లకుంట, గోల్నాక పరిధిలో ఇద్దరు చొప్పున, బర్కత్‌పురలో ఒకరికి వైరస్‌ సోకింది. నల్లకుంట పరిధిలో కరోనాతో ఒక వ్యక్తి మృతి చెందాడు. ముషీరాబాద్ నియోజకవర్గంలో ఐదుగురికి కొవిడ్‌ పాజిటివ్ రాగా... వీరిలో ఇద్దరు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. రామ్‌నగర్‌కు చెందిన ఓ కానిస్టేబుల్‌కు కరోనా సోకినట్టు నిర్ధారించారు. కవాడిగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు ప్రాంతాలకు చెందిన ఇద్దరు మహిళలకు, కూకట్‌పల్లి ఎల్లమ్మ బండకు చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌కి కరోనా సోకింది. వీరిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు.

దూలపల్లిలో మళ్లీ ప్రారంభం..

కరోనా నిర్ధారణ అయినప్పటికీ... లక్షణాలు లేని వారిని ఇంటి వద్దే ఉంచి చికిత్స అందిస్తున్నారు. పెరుగుతున్న కేసులు దృష్టిలో ఉంచుకుని దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో గతంలో మూసేసిన క్వారంటైన్ కేంద్రాన్ని అధికారులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారిని ఉంచేందుకు మరింత వెసులుబాటు కలిగింది. కార్పొరేట్ చికిత్స రుసుములపై మార్పులు చేసే ఆలోచన లేదని వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గతంలో నిర్ణయించిన ఫీజులనే కొనసాగించనున్నట్లు స్పష్టం చేశారు. ప్రజాఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కార్పొరేట్ ఆస్పత్రులు పని చేయాలని సూచించారు.

స్వచ్ఛంద బంద్..

జీహెచ్​ఎంసీ పరిధి సహా చుట్టుపక్కల జిల్లాల్లోనూ ప్రభుత్వం ప్రారంభించిన 50 వేల కరోనా పరీక్షల శాంపిళ్ల సేకరణ కొనసాగుతోంది. ఎర్రగడ్డలో మూడు రోజుల్లో 581 శాంపిళ్లను సేకరించగా, బేగంపేట ప్రకృతి వైద్యాఆసుపత్రిలో 500, సరోజినీదేవి కంటి ఆస్పత్రిలో 770, చార్మినార్ టీబీ ఆస్పత్రిలో 640, అంబర్‌పేటలో 338, జియాగూడలో 515, మలక్ పేటలో 366, గోల్కొండలో 333 మంది నుంచి గత మూడు రోజుల్లో శాంపిళ్లు సేకరించారు. భాగ్యనగరంలో అంతకంతకూ కేసులు పెరుగుతున్న దృష్ట్యా గడువుకు ముందే దుకాణాలు స్వచ్ఛందంగా మూసేసేందుకు హైదరాబాద్ కిరాణా జనరల్ మర్చంట్స్ అసోషియేషన్ నిర్ణయం తీసుకుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం మూడు గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొంది.

ఇదీ చూడండి: సెలవిక: బరువెక్కిన జన హృదయం.. అడుగడుగునా పూలవర్షం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.