ETV Bharat / city

రోడ్లపై తిరుగుతున్న కొవిడ్ రోగులు..కారణం అదే..! - వైరస్‌ విస్తృత వ్యాప్తి

ప్రత్యామ్నాయం లేక కొందరు.. అవగాహన లేక మరికొందరు.. నిర్లక్ష్యంగా ఇంకొందరు కొవిడ్‌ వ్యాప్తికి కారణమవుతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నుంచి ఈ కోణంలో పర్యవేక్షణకు ఏ విధమైన ఏర్పాట్లూ లేవు. కరోనా రోగుల కోసం ప్రత్యేక రవాణా సౌకర్యాలూ లేవు. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి ఎన్నో రెట్లు పెరిగిపోతోంది. రోజూ వేల సంఖ్యలో పాజిటివ్‌ కేసులు వస్తున్నాయి. ఈ మహమ్మారితో మరణించే వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. ప్రైవేటు ల్యాబ్‌లు, కొవిడ్‌ పరీక్ష కేంద్రాలు, వ్యాక్సిన్‌ కేంద్రాలు, ఆసుపత్రులు.. ఇలా అన్నీ కిటకిటలాడుతున్నాయి. ఎక్కడా ఆయా ఆవరణల్లో కొవిడ్‌ రోగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు లేవు. ఈ కేంద్రాలన్నీ కొవిడ్‌ మరింత విస్తరణకు కారణమయ్యే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమమవుతోంది.

covid patients
కరోనా రోగులు
author img

By

Published : Apr 23, 2021, 10:15 AM IST

హైదరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన భార్యా భర్తలిద్దరూ కరోనా బారిన పడ్డారు. ఒకరికి సీరియస్‌ కావడంతో అర్ధరాత్రి ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. సాయంగా ఎవరూ వచ్చే పరిస్థితి లేదు. అంబులెన్స్‌ అడిగితే ఎప్పటికి వస్తుందో తెలియదు. ఎందుకంటే బాధితుల సంఖ్య ఎక్కువ కావడంతో దీనికి డిమాండ్‌ పెరిగింది. ఆ సమయంలో క్యాబ్‌లో వెళ్లడం తప్ప మరో మార్గం లేదు. ఇలా వెళ్లడం వల్ల క్యాబ్‌ డ్రైవర్‌కు ముప్పు. అతని నుంచి మరెందరికో సోకవచ్చు.

ఆ ఇంట్లో ఉండేది వృద్ధ దంపతులిద్దరే. ఉభయులకూ పాజిటివ్‌ అని తేలింది. పరీక్షలకు, వైద్యసేవలకు క్యాబ్‌లో వెళ్లారు. ఆసుపత్రికి వెళ్లాక అక్కడ కొవిడ్‌ రోగులకంటూ ప్రత్యేక వరుస విధానమేదీ లేదు. ఇతర రోగుల మధ్యే వీరూ వరుసలో నిలబడి బిల్లు చెల్లించారు.

ఒక ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వ్యక్తి(52)కి దగ్గు, ఒళ్లునొప్పులు మొదలయ్యాయి. మూడు రోజుల నుంచి లక్షణాలు కనిపిస్తున్నా.. ఇంటి నుంచి కార్యాలయానికి కొన్నిసార్లు మెట్రో రైలులో, మరికొన్ని సార్లు షేరింగ్‌ ఆటోలో ప్రయాణం చేశారు. జ్వరం కూడా రావడంతో కొవిడ్‌ పరీక్ష కోసం సమీపంలో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లారు. అక్కడ గుంపులు గుంపులుగా ప్రజలు పరీక్షల కోసం వేచిచూస్తున్నారు. వారితో పాటు ఆయన కూడా 2 గంటల పాటు వరుసలో నిల్చొని పరీక్ష చేయించుకున్నారు. అరగంటలోపే వైరస్‌ సోకినట్లుగా నిర్ధారణ అయింది. అక్కడ నిల్చున్న సమయంలో పలు సందర్భాల్లో ఊపిరి ఆడక మాస్కు తీయాల్సి వచ్చింది. అప్పుడే పక్కనున్నవారితో మాట్లాడారు కూడా.

... ఇవన్నీ కొవిడ్‌ అతి వేగంగా ఇతరులకు వ్యాప్తి చెందడానికి కారణమవుతున్నాయి.

సాయం చేసే వారు లేక...

కొవిడ్‌ నిర్ధారణ మొదలుకొని చికిత్స వరకూ అన్ని సందర్భాల్లోనూ.. ఏదో ఒక అంశంపై కచ్చితంగా బయటకు వెళ్లాల్సిందే. కనీసం ఇంట్లో నిత్యావసరాలు కావాలన్నా వెలుపలకు వెళ్లక తప్పని పరిస్థితి. ఎందుకంటే వైరస్‌ సోకిందని తెలియగానే.. సహాయం చేయడానికి ఎక్కువమంది ముందుకు రావడం లేదు. ఇక పరీక్షల కోసం వెళ్లాలంటే ఎవరూ వెంటనే వచ్చే పరిస్థితి లేదు. దీంతో ఎవరికి వారే ఏదో ఒక వాహనాన్ని అద్దెకు తీసుకొని వెళ్తున్నారు. ఈ ప్రయాణాల్లో వైరస్‌ వ్యాప్తి చెందే అవకాశాలుంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఒకే గదిలో ఉన్న సహచరులకో, ఒకే ఇంట్లో ఇతర కుటుంబ సభ్యులకో కొవిడ్‌ వస్తే తక్కిన వారు సొంతూరుకో, ఇతరుల ఇంటికో వెళ్తున్నారు. తర్వాత వారూ.. అక్కడ వైరస్‌ కోరల్లో చిక్కుకున్నట్లుగా తేలుతోంది. ఇటువంటప్పుడు వారు ప్రయాణించిన బస్సులు, ఆటోల్లో ఉన్న వారికి కూడా సోకే ప్రమాదముంది.

వాతావరణ మార్పుతో అయి ఉండొచ్చని...

జలుబు, ఒళ్లు నొప్పులు, కొద్ది పాటి జ్వరం ఉంటే వాతావరణ మార్పుతోనో లేదా వేరే కారణంతోనో అయి ఉంటుందని భావించి కొందరు మామూలుగానే అన్ని చోట్లా తిరిగేస్తున్నారు. నాలుగు రోజుల తర్వాత పాజిటివ్‌ అని తేలితే అప్పుడు చింతిస్తున్నారు. ‘అయ్యో అనేక చోట్ల తిరిగానే. ఎంత మందికి నా వల్ల కొవిడ్‌ వచ్చిందో’నని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు అనేకం కనిపిస్తున్నాయి.

ఇంట్లో ఐసొలేషన్‌లో ఉన్నా...

రోజూ నమోదవుతున్న కేసుల సంఖ్య కంటే.. కోలుకొనే వారి సంఖ్య బాగా తక్కువగా ఉంటోంది. ఎక్కువ మంది ఇంట్లోనే ఐసొలేషన్‌లో ఉంటున్నారు. ఇంట్లో ఉన్నా కనీస వైద్యానికి ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. సీటీ స్కాన్‌, రక్తపరీక్షలు లాంటివి ఒకటికి రెండు సార్లు చేయించాల్సి వస్తుంది. వీటన్నింటికి ఏదో వాహనంలో బయటకు వెళ్లాల్సిందే. గతంలో ఇంట్లో ఒకరికి వస్తే ఆ వ్యక్తిని ఐసొలేషన్‌లో ఉంచి.. మిగిలిన వారు అవసరమైన సాయం చేసేవారు. కానీ రెండో దశ దీనికి భిన్నంగా ఉంది. చాలా వేగంగా ఇంటిల్లిపాదికి వ్యాపిస్తోంది. ఇలా ఇంట్లో అందరికీ వచ్చినవారు చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు.

ఎక్కడికక్కడ కమిటీలు ఏర్పాటు చేయాలి: నిపుణులు

కొవిడ్‌ అని తేలిన తర్వాత రోగులు బయటకు రావాల్సిన పరిస్థితి ఉంటే అటు బాధితులకు.. ఇటు సామాన్య ప్రజానీకానికి ఇబ్బందుల్లేని సురక్షిత వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘‘ప్రస్తుతానికి ప్రభుత్వం నుంచి వారికి రవాణా విషయంలో ఏ విధమైన సహాయం అందడం లేదు. మరోవైపు వారి కదలికలపై పర్యవేక్షణ అంతకంటే లేదు. ఆయా ప్రాంతాల్లోని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఎక్కడికక్కడ ప్రభుత్వం కమిటీలు ఏర్పాటు చేయాలి’’ అని వారు సలహా ఇస్తున్నారు. ఆ పరిధిలోని కొవిడ్‌ బాధితులకు అవసరమైన సాయం అందించే ప్రయత్నం చేయకపోతే వైరస్‌ వ్యాప్తి మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చూడండి: కరోనా కలవరం: ఆక్సిజన్‌ మీదే 60% మంది

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.