విజయవాడలోని ఆటోనగర్ లిబర్టీ ఆస్పత్రిలో కరోనా రోగి మృతి వ్యవహారం వివాదాస్పదమైంది. కొవిడ్ చికిత్స పేరుతో రూ.15 లక్షలు వసూలు చేశారని మృతుడి భార్య ఆరోపించారు. ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించాడని పటమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
రాజమహేంద్రవరానికి చెందిన శ్రీనివాసరావు... ఆస్పత్రిలో 10 రోజులపాటు చికిత్స పొందారు. ఆక్సిజన్ కోసమంటూ సి.పాప్ యంత్రం కొనుగోలు చేయించారని మృతుడి భార్య వెల్లడించారు. తొలుత రూ.6 లక్షల ప్యాకేజ్ మాట్లాడి తర్వాత రూ.15 లక్షలు అన్నారని ఫిర్యాదులో వివరించారు. సరైన వైద్యం అందించని లిబర్టీ ఆస్పత్రిపై చర్యలు తీసుకోవాలని కోరారు.