రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. 24 గంటల్లో కొత్తగా 8,732 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,81,817కు చేరింది. మహమ్మారి బారిన పడి మరో 87 మంది మృతి చెందగా.. మొత్తం 2,562 మంది వైరస్‌తో ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో కరోనా నుంచి 1,91,117 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 88,138 యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 53,712 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. ఇప్పటివరకూ 28.12 లక్షల మందికి అధికారులు కరోనా పరీక్షలు చేశారు.
ఇదీ చూడండి..