రాష్ట్రంలో వరుసగా పదో రోజు 10వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 10,825 కరోనా కేసులు, 71 మరణాలు నమోదైనట్టు ప్రభుత్వం తెలిపింది. మొత్తం కేసుల సంఖ్య 4,87,331కి చేరింది. కరోనాతో ఇప్పటివరకు 4,347 మంది మృతి చెందారు. కరోనా నుంచి మరో 11,941 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనా నుంచి 3,82,104 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 1,00,880 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. 24 గంటల వ్యవధిలో 69,623 కరోనా పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 40,35,317 కరోనా పరీక్షలు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది.
కరోనా మృతులు...
కరోనాతో నెల్లూరులో 13, అనంతపురంలో 8, పశ్చిమగోదావరి జిల్లాలో 8, చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఏడుగురు చొప్పున మృతి చెందారు. విజయనగరంలో 6, ప్రకాశం జిల్లాలో ఐదుగురు మరణించారు. విశాఖలో 5, కృష్ణాలో 4, కడప జిల్లాలో ముగ్గురు మృతి చెందారు. కర్నూలులో 2, శ్రీకాకుళంలో 2, తూర్పుగోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.
జిల్లాల్లో కేసులు...
తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 1,399 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రకాశంలో 1,332, పశ్చిమగోదావరి జిల్లాలో 1,103, నెల్లూరులో 1,046, కడపలో 1,039, చిత్తూరులో 938, విశాఖలో 765, విజయనగరంలో 642, గుంటూరులో 641, శ్రీకాకుళంలో 601, అనంతపురంలో 549, కర్నూలులో 433, కృష్ణా జిల్లాలో 337 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది.
ఇదీ చదవండీ... 'టీకా కోసం 2021 ద్వితీయార్థం వరకు ఆగాల్సిందే'