గత 24 గంటల్లో రాష్ట్రంలో 28,418 మందికి కొవిడ్ పరీక్షలు చేయగా.. 50 మందికి వైరస్ సోకిందని వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటించింది. 121 మంది మహమ్మారి నుంచి కోలుకోగా.. ఒక్కరు మరణించారని వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు కోటీ 34 లక్షలకు పైగా నమూనాలను పరీక్షించగా.. మొత్తం 8,88,605 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో 8.8 లక్షల మంది బాధితులు వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని ఇళ్లకు వెళ్లారు. ఇప్పటివరకు మెుత్తం 7,161 మంది మహమ్మారి ధాటికి మరణించారు.
ఇదీ చదవండి: