ETV Bharat / city

MMTS: హైదరాబాద్​లో... ఎంఎంటీఎస్​ రైళ్లకు మోక్షం ఎప్పుడో..? - hyderabad latest news

తెలంగాణలోని భాగ్యనగరవాసులను కరోనా కష్టాలు ఇంకా వీడటం లేదు. లాక్‌డౌన్‌తో ఆగిపోయిన ఎంఎంటీఎస్​ రైళ్లు(mmts trains) ఏడాదిన్నర గడిచినా పట్టాలెక్కలేదు. చిరు వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలకు అవస్థలు తప్పడం లేదు. 5, 10 రూపాయలకే దర్జాగా ప్రయాణించేవారు.. ఇప్పుడు రోజుకు రూ.100 రవాణాకు ఖర్చు చేయాల్సి వస్తోంది. మెట్రో, ఆర్టీసీ నడుస్తున్నప్పుడు.. ఎంఎంటీఎస్ ఎందుకు నడపడం లేదంటూ నగర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

mmts trains
ఎంఎంటీఎస్​ రైళ్లు
author img

By

Published : Jun 14, 2021, 9:57 AM IST

తెలంగాణలోని హైదరాబాద్ మహానగర ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులతో మల్టీ మోడల్ ట్రాన్స్‌ఫోర్ట్ సిస్టం ( ఎంఎంటీఎస్​) అందుబాటులోకి వచ్చింది. ఎంఎంటీఎస్​(mmts trains) రాకతో ప్రయాణికులు ఎక్కువ దూరాన్ని.. తక్కువ ఖర్చుతో ప్రయాణించే వెసులుబాటు కలిగింది. కేవలం రూ.5, 10, 15లతో చిరు వ్యాపారులు, ఉద్యోగులు సేవలు వినియోగించుకునేవారు.

2003 ఆగస్టులో ప్రారంభమైన ఎంఎంటీఎస్ రైళ్లు.. గతేడాది మార్చి 23 వరకు నిరంతరాయంగా సేవలందించాయి. అలాంటిది కరోనా దెబ్బకు 18 నెలలుగా షెడ్డుకే పరిమితమయ్యాయి. అరకొర జీతాలు, ఆదాయంతో బతుకుబండి నడిపేవారికి.. ఎంఎంటీఎస్ నడవకపోవడం ఇబ్బందిని కలిగిస్తోంది. పెట్రోల్ ఖర్చులు విపరీతంగా పెరగడంతో సొంతవాహనాల్లో వెళ్లడమూ ఇబ్బందిగా మారింది. తమ సగం జీతం రవాణా ఖర్చులకే పోతోందంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రైళ్లు సికింద్రాబాద్-లింగంపల్లి, హైదరాబాద్-లింగంపల్లి మధ్య 29 కిలోమీటర్ల మేర 2003 నుంచి నిరంతరం సేవలందిస్తున్నాయి. 15 కిలోమీటర్ల సికింద్రాబాద్-ఫలక్ నుమా సెక్షన్ ఫిబ్రవరి 2014లో ప్రారంభమైంది. జంట నగరాల్లో మొత్తం 26 స్టేషన్లలో ఎంఎంటీఎస్ రైళ్లు సేవలందిస్తున్నాయి. ప్రారంభంలో 48 సర్వీసులు, 6 కోచ్‌లు 13 వేల మంది ప్రయాణికులతో ప్రారంభమైన సర్వీసులు.. ప్రస్తుతం 121 సర్వీసులతో లక్షా 65 వేల మంది ప్రయాణికుల స్థాయికి చేరుకున్నాయి.

ప్రస్తుతం ఎంఎంటీఎస్ రైళ్లు నడవకపోవడంతో నగరవాసులకు ప్రయాణం భారంగా మారుతోంది. ఆర్టీసీ, క్యాబ్‌లు, ఆటోలు, మెట్రో నడుపుతున్నపుడు.. ఎంఎంటీఎస్ మాత్రం ఎందుకు నడపడం లేదని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. చిరు ఉద్యోగులు, వ్యాపారులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా ప్రభుత్వం ఎంఎంటీఎస్‌ రైళ్ల పున:ప్రారంభంపై ఆలోచన చేయాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

AP News: 2021-22 ఆర్థిక సంవత్సరంలో వివిధ రంగాలకు రూ.2.83 లక్షల కోట్ల రుణాలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.