తెలంగాణ నిర్మల్ జిల్లాలోని భైంసా బాలుర గురుకుల పాఠశాలలో కరోనా కలకలం కొనసాగుతోంది. కొత్తగా మరో 25 మందికి కొవిడ్ నిర్ధరణ అయింది. పాఠశాలలో మొత్తం 180 మంది విద్యార్థులుండగా... రెండు రోజుల్లో 90 మందికి పరీక్షల నిర్వహించారు.
కొత్తగా నమోదైన కేసులతో కలిపి మొత్తం 35 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పాఠశాల యాజమాన్యం మిగతా విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించనుంది. బాధిత విద్యార్థులను హోంఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు అదిలాబాద్ జిల్లా ఉట్నూరు సెంట్‌పాల్ స్కూల్లో ముగ్గురు విద్యార్థులకు కరోనా నిర్ధరణ అయింది. గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ ఒప్పంద ఉపాధ్యాయునికి కరోనా సోకింది.