CORONA CASES IN AP: ఏపీలో కరోనా కేసుల సంఖ్య నిన్నటితో పోల్చితే స్వల్పంగా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 75 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 46 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 536 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,846 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
దేశంలో భారీగా పెరిగిన కరోనా మరణాలు
Covid Cases In India: భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు స్థిరంగా నమోదవుతున్నా. కొత్తగా 2,528 మందికి వైరస్ సోకింది. అయితే మరణాలు మాత్రం క్రితం రోజుతో(60) పోల్చితే భారీగా పెరిగాయి. కొత్తగా మరో 149 మంది ప్రాణాలు కోల్పోయారు. 3,997 వైరస్ను జయించారు. రోజువారీ పాజిటివిటీ రేటు 0.40శాతం ఉంది.
- మొత్తం కేసులు: 4,30,04,005
- మొత్తం మరణాలు: 5,16,281
- యాక్టివ్ కేసులు: 29,181
- కోలుకున్నవారు: 4,24,58,543
Vaccination in India : దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. గురువారం మరో 15,77,783 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,97,94,588కు పెరిగింది.
Covid Tests: దేశంలో గురువారం 6,33,867 కరోనా టెస్టులు నిర్వహించారు.
ఇదీ చదవండి : Tenth Class Exams : మారిన పది పరీక్షల షెడ్యూల్...ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకూ ఎగ్జామ్స్...