ETV Bharat / city

Covid Alert: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కొవిడ్​.. అప్రమత్తమైన అధికార యంత్రాంగం - telangana news

ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలకలం వేళ తలంగాణలో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. నిన్న మొన్నటి వరకు అంతంత మాత్రంగా నమోదైన కేసులు.. తాజాగా రెట్టింపు స్థాయిలో వెలుగుచూస్తుండటంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వైరస్‌ జాగ్రత్తలతో పాటు వ్యాక్సినేషన్‌ను విస్తృతంగా చేపట్టేందుకు చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వచ్చే ఆరువారాలు అత్యంత కీలకమని.. అప్రమత్తంగా ఉండాలని వైద్యఆరోగ్యశాఖ సూచించింది.

TELANGANA CORONA CASES
TELANGANA CORONA CASES
author img

By

Published : Dec 6, 2021, 7:16 AM IST

corona cases increasing in telangana: తెలంగాణలో కరోనా మహమ్మారి మళ్లీ కలవరానికి గురిచేస్తోంది. ఇటీవల రోజువారీ కొవిడ్‌ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు వైద్య కళాశాలలో ఏకంగా 43 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్‌గా నిర్ధారణ కావడం వైద్యవర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది. గత నెల 20న 134 కొత్త కేసులు నమోదు కాగా.. ఈ నెల 1న 193 నిర్ధారణ అయ్యాయి. ఆ తర్వాత మూడు రోజుల వ్యవధిలోనే ఈ నెల 4న కేసుల సంఖ్య 200 దాటింది. క్రియాశీల కేసులను పరిశీలిస్తే పాజిటివ్‌ల సంఖ్య వేగంగా పెరుగుతున్నట్లు తెలుస్తోంది. గత నెల 20న రాష్ట్రంలో 3వేల 626 యాక్టివ్‌ కేసులు ఉండగా.. ఈ నెల 5న 3వేల 787కి పెరిగాయి. కేవలం 2 వారాల వ్యవధిలోనే 161 క్రియాశీల కేసులు పెరిగినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

43 మంది వైద్య విద్యార్థులకు..

corona to medicos: కరీంనగర్‌ జిల్లా బొమ్మకల్‌ గ్రామంలోని చల్మెడ ఆనందరావు వైద్య కళాశాలలో 43 మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. తొలుత అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. శని, ఆదివారాల్లో నిర్వహించిన పరీక్షల్లో మరో 42 మందికి వైరస్‌ నిర్ధరణ అయినట్లు కళాశాల ఛైర్మన్‌ వెల్లడించారు. కరోనా కలకలంతో నిన్న సాయంత్రం నుంచి కళాశాలకు సెలవు ప్రకటించారు. గత ఆదివారం నిర్వహించిన కళాశాల వార్షికోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు ఒకరి నుంచి ఒకరికి కరోనా సోకినట్లు భావిస్తున్నారు.

హాస్టల్​ కరోనా కలకలం
మంచిర్యాలలోని కాలేజీ రోడ్‌లో గల మిమ్స్ హాస్టల్‌లో కరోనా కలకలం చెలరేగింది. మిమ్స్ కళాశాలలో ఇంటర్ చదువుతున్న విద్యార్థినికి గత మూడ్రోజులుగా జ్వరం రాగా... అనుమానంతో పరీక్షలు చేయించారు. టెస్టుల్లో పాజిటివ్‌గా నిర్ధరణ అవటంతో మిగతా విద్యార్థులంతా ఆందోళనకు గురవుతున్నారు. రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌ నగర పాలక సంస్థ పరిధిలోని గిరిధారి ఎగ్జిక్యూటివ్​ పార్క్‌ అపార్ట్‌మెంట్‌లో 10మందికి పైగా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం స్థానికులు 161మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించారు.

అప్రమత్తమైన వైద్యారోగ్య శాఖ

ఒమిక్రాన్‌ వేరియంట్‌ నేపథ్యంలో రాష్ట్రంలో కేసులు పెరుగుతుండటం పట్ల వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా నిబంధనలు కఠినతరం చేయటంతో పాటు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. రాష్ట్రంలో వచ్చే ఆరువారాలు అత్యంత కీలకమని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు సూచించారు. మాస్క్​, స్వీయజాగ్రత్తలతో బయటపడదామని కోరారు.

మాస్క్​ ధరించనివారిపై కేసులు

కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తే పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో జీవించే హక్కు మార్చి ఆఖరులో లాక్‌డౌన్‌ అమలైనప్పుటి నుంచి మాస్క్‌ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తున్న వారిపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు.

ఇవీ చదవండి:

Omicron variant: ఒమిక్రాన్ వేరియంట్ ఎంత ప్రమాదకరం..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.