కరోనాతో బాధపడుతూ గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 98మంది మృతి చెందారని వైద్య, ఆరోగ్యశాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. గత 24 గంటల్లో 89వేల 535 కరోనా పరీక్షలు చేయగా.. 22వేల 517 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకూ రాష్ట్రంలో 14 లక్షల 11వేల 320 మంది వైరస్ బారినపడగా.. ఇప్పటివరకు మొత్తం 1కోటి 78 లక్షల 80వేల 755 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.
కొవిడ్‌తో బాధపడుతూ.. గడిచిన 24 గంటల్లో అనంతపురంలో 12 మంది మృతి చెందారు. నెల్లూరులో 11, తూర్పుగోదావరి 10, విశాఖ 9, విజయనగరం 9, చిత్తూరు 8, శ్రీకాకుళం 8, గుంటూరు 7, పశ్చిమగోదావరి 7, కృష్ణా 5, కర్నూలు 5, ప్రకాశం 5, కడపలో ఇద్దరు మృత్యువాతపడ్డారు. తాజాగా 18వేల 739 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం 11 లక్షల 94వేల 582 మంది కరోనా నుంచి బయటపడ్డారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా తూర్పుగోదావరిలో 3వేల 383 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా విజయనగరంలో 992 మంది కరోనా బారిన పడ్డారు.
ఇదీ చదవండి: