రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 45,077కరోనా పరీక్షలు నిర్వహించగా.. 102 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు కొవిడ్‌తో మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 8,90,317కి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 7,171 మంది బాధితులు ప్రాణాలు కోల్పోయారు.
ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 56 మంది పూర్తిగా కోలుకోగా.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,82,275కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 871యాక్టివ్ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,40,92,251కరోనా సాంపుల్స్‌ని పరీక్షించినట్లు ఆరోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
ఇదీ చదవండి: