తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 226 కరోనా కేసులు నమోదవ్వగా.. మహమ్మారి బారిన పడి ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 2,92,621 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 1,584కు చేరింది. మరోవైపు తాజాగా కరోనా నుంచి మరో 224 మంది బాధితులు కోలుకోగా... మొత్తం 2,87,117మంది వైరస్ను జయించారు. తెలంగాణలో ప్రస్తుతం 3,920 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో 2,322 మంది బాధితులు హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
ఇదీ చూడండి : 'రెండోదశ వ్యాక్సినేషన్లో ప్రధానికి టీకా'