రాష్ట్రంలో గత 24 గంటల్లో 34,864 మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 75 మందికి కరోనా సోకినట్లు తేలింది. మరో 133 మంది పూర్తిగా కోలుకోగా.. వైరస్ ధాటికి రాష్ట్రంలో ఒకరు మరణించారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా మెుత్తం కరోనా పరీక్షల సంఖ్య కోటీ 33 లక్షలు దాటగా.. మొత్తం 8,88,350 మందికి కరోనా నిర్ధరణ జరిగినట్లు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. వారిలో 8.8 లక్షల మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నట్టు పేర్కొంది. ఇప్పటివరకు 7,159 మంది కొవిడ్‌తో మృతి చెందారని తెలిపింది.
ఇదీ చదవండి: