ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీ పోస్టుల భర్తీ పై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు అమలు చేయలేదన్న.. కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలపై విచారణ ముగిసింది. గత ఉత్తర్వులను వక్రీకరిస్తూ జీవో 37 విడుదల చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. ఇ-రేషనలైజేషన్ ప్రక్రియను అధికారులు ప్రారంభించారని పిటిషనర్ న్యాయవాది వివరించారు. ఈ విచారణకు ముఖ్య కార్యదర్శి రాజశేఖర్, విద్యాశాఖ డైరెక్టర్ చినవీరభద్రుడు కోర్టు ముందుకు హాజరయ్యారు. వాదోపవాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను అక్టోబర్ 22కు వాయిదా వేసింది. తదుపరి విచారణకు కూడా అధికారులు కోర్టుకు రావాలని ఆదేశించింది.
ఇదీ చదవండి : అమరావతి భూముల ఆంశంపై హైకోర్టులో విచారణ వాయిదా