ETV Bharat / city

రాయితీ అంటూ ఆకర్షించి.. కొన్నాక పూర్తి బిల్లు.. చెన్నై షాపింగ్​మాల్‌కు షాక్​!

రాయితీ అంటూ వినియోగదారుడిని ఆకర్షించి.. కొనుగోలు చేశాక పూర్తి బిల్లు వసూలు చేసిన చెన్నై షాపింగ్​మాల్​కు వినియోగదారుల కమిషన్ మొట్టికాయలు వేసింది. అదనంగా వసూలు చేసిన మొత్తం, పరిహారం, కేసు ఖర్చులు కలిపి మొత్తంగా రూ.15,306 చెల్లించాలని ఆదేశించింది.

చెన్నై షాపింగ్​మాల్‌కు షాక్​!
చెన్నై షాపింగ్​మాల్‌కు షాక్​!
author img

By

Published : Jun 6, 2022, 10:01 AM IST

రాయితీ అంటూ ఆకర్షించి.. పూర్తి బిల్లు వసూలు చేసిన సికింద్రాబాద్‌లోని చెన్నై షాపింగ్‌మాల్‌.. వినియోగదారుడికి రూ.15,306 చెల్లించాలని హైదరాబాద్‌ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌-3 ఆదేశించింది. తెలంగాణలోని నాచారం భవానీ నగర్‌కు చెందిన సీహెచ్‌ శ్రీకాంత్‌ చరవాణికి 2019 అక్టోబరు 19న చెన్నై షాపింగ్‌మాల్‌ నుంచి రాయితీకి సంబంధించిన సందేశం వచ్చింది. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు ద్వారా లావాదేవీ జరిపితే 5 శాతం వరకు బిల్లులో తగ్గింపు వస్తుందని పేర్కొన్నారు. అదే నెల 27న ఆ షాపింగ్‌ మాల్‌కు వెళ్లిన ఆయన.. రూ.4,083తో నూతన వస్త్రాలు, రూ.2,030తో ఆభరణాలు కొనుగోలు చేశారు.

ఎస్‌బీఐ కార్డుతో బిల్లు చెల్లించినా రాయితీ ఇవ్వలేదు. దీంతో వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించగా.. విచారణ జరిపిన కమిషన్‌-3 అధ్యక్షుడు ఎం.రామ్‌గోపాల్‌రెడ్డి, సభ్యులు డి.శ్రీదేవి, జె.శ్యామల బెంచ్‌.. సాక్ష్యాధారాలు పరిశీలించి వినియోగదారుడి వాదనలతో ఏకీభవించింది. ఆయన నుంచి అదనంగా వసూలు చేసిన 5 శాతం (రూ.306), పరిహారం కింద రూ.10 వేలు, కేసు ఖర్చులు రూ.5 వేలు ఇవ్వాలని చెన్నై షాపింగ్‌మాల్‌ను ఆదేశించింది.

ఇదీ చూడండి..

మన జాతీయ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో తెలుసా?

అంబానీ కాబోయే కోడలి భరతనాట్య అరంగేట్రం

Rape: కాకినాడలో దారుణం.. బాలికపై ప్రైవేటు వసతిగృహం నిర్వాహకుడు అత్యాచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.