AP Special Status: వైకాపాకు 28 మంది ఎంపీలున్నా ప్రత్యేక హోదా అంశంపై కేంద్రపై ఒత్తిడి తేవటం లేదని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ విమర్శించారు. విభజన చట్టంలోని అంశాలతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రకు నిధుల కోసం కేంద్రంపై పోరాటం చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన శైలజానాథ్.. భాజపా దేశానికి పట్టిన శని అని విమర్శించారు. అధికారంకోసం భాజపా నేతలు ఎంతకైనా దిగజారుతారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా అశంపై మోదీ ప్రభుత్వం రకరకాల డ్రామాలాడటం శోచనీయమని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి విమర్శించారు. ఈనెల 17న జరగనున్న కేంద్ర హోంమంత్రిత్వ ఉపకమిటీ అజెండాలో ఉదయం హోదా అంశాన్ని ఉంచి సాయంత్రానికి తొలగించటం గర్హనీయమన్నారు. అజెండాను తయారు చేయలేని చేతకాని మోదీ ప్రభుత్వం.. దేశాన్ని పాలించటం దురదృష్టకరమన్నారు. భాజపా మోసకారి తనం, తెదేపా, వైకాపాల చేతగాని తనం వల్లే ఏపీకి ప్రత్యేక హోదా రావటం లేదన్నారు.
ఇదీ చదవండి :
విశాఖకు పరిపాలనా రాజధాని వచ్చి తీరుతుంది: మంత్రి బొత్స