కేంద్ర ప్రభుత్వం అగ్రవర్ణ పేదలకు విద్యా, ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించినా.. రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు చేయట్లేదని.. ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి ఆరోపణలు చేశారు. దీంతో విద్యా, ఉద్యోగాల్లో అర్హులైన వారు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు.
అనేక రాష్ట్రాల్లో అగ్ర కులాల పేదలకు.. 10శాతం రిజర్వేషన్లు అమలుచేస్తున్నాయని తెలిపారు. అగ్ర కులాల పేదలు అర్హులైన వారు ఉద్యోగాలు లేక.. తల్లిదండ్రులకు భారమై జీవచ్ఛవాల్లా జీవిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి వెంటనే వారికి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. జనవరి 23, 24 తేదీల్లో అన్ని జిల్లా కేంద్రాల్లో అగ్ర కులాల పేదలకు రిజర్వేషన్ అమలు చేయాలని.. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టర్లకు మెమొరాండంలు ఇస్తామన్నారు.
ఇదీ చదవండి: స్థానిక ఎన్నికల నిర్వహణపై గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ