ETV Bharat / city

అవిశ్వాస తీర్మానం పెట్టి చిత్తశుద్ధిని నిరూపించుకోండి: తులసిరెడ్డి - special status for ap

ప్రత్యేక హోదా విషయంలో ప్రజలను వైకాపా నమ్మించి మోసం చేసిందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి విమర్శించారు. ఈ విషయంలో కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టి జగన్ తన చిత్తుశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు.

Congress Leader Tulasi Reddy
Congress Leader Tulasi Reddy
author img

By

Published : Aug 16, 2020, 5:56 PM IST

రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి మాతృభాషను ఆదరించాలని చెబుతుంటే... రాష్ట్ర సీఎం జగనన్​ మాత్రం అమ్మభాషను అంటరాని భాషగా చూడటం దురదృష్టకరమని కాంగ్రెస్​ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్​ తులసిరెడ్డి అన్నారు. స్వాంతంత్య్ర దినోత్సవం సందర్భంగా కూడా సీఎం జగన్​ అదే రీతిలో మాట్లాడారని విమర్శించారు.

ప్రజలను మోసం చేశారు...

హోదాపై వైకాపా మాట మార్చిందని....కేవలం కేంద్రాన్ని అడుగుతూనే ఉంటామని చెప్పడం ప్రజలను నమ్మించి మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు. హోదా అంశంపై కట్టుబడి ఉంటే...కేంద్రంపై వైకాపా తన ఎంపీలతో అవిశ్వాస తీర్మానం పెట్టించాలని సవాల్ చేశారు. మూడు రాజధానుల పేరుతో రాష్ట్రానికి రాజధాని లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా మూడు రాజధానులు లేవని దుయ్యబట్టారు.

ఇదీ చదవండి

అక్రమ మద్యం కేసులో ఏ-1 నిందితుడిగా భాజపా నేత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.