ప్రత్యేక హోదా, విభజన హమీలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ హమీ ఇచ్చిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు అయ్యేవని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా ఐదు కాదు 10 సంవత్సరాల ఇవ్వాలన్న భాజపా...అధికారంలోకి వచ్చిన తరువాత పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో తెదేపా, వైకాపా ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడాలని సూచించారు.
అంతర్వేది ఘటనపై భాజపా, జనసేన, తెదేపా రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో అనేక సమస్యలు ఉండగా వాటి గురించి పట్టించుకోకుండా మత రాజకీయాలు చేయడం తగదన్నారు.
ఇదీ చదవండి