ప్రభుత్వ ఆస్తులు అమ్మడం, ఎడాపెడా అప్పు చేయడం, ప్రజలపై అధిక పన్నుల భారం మోపడం.. ఈ మూడు సూత్రాల ప్రణాళికతో జగన్ పాలన సాగుతోందని కాంగ్రెస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసి రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మి వచ్చిన డబ్బుతో నవరత్నాలు, నాడు-నేడు కార్యక్రమాలు అమలు చేయాలనుకోవడం సరైన నిర్ణయం కాదని అన్నారు. దీనికి "బిల్డ్ ఏపీ" అని పేరు పెట్టడం సమంజసంగా లేదని "సోల్డ్ ఏపీ" అని పేరు పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
కరోనా కాలంలో మద్యం అమ్మకాలే ప్రభుత్వ ఆదాయమా?.. మద్యపానంతో ప్రజలను కరోనాకు దగ్గర చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ ఆరోపించారు. ప్రజల నుంచి జేటాక్స్ రూపంలో వసూలు చేస్తూ తాగుబోతులుగా తయారు చేస్తుందని మండిపడ్డారు.
ఇదీ చూడండి..