రాష్ట్రంలో అగ్రవర్ణ పేదలకు 10 శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలుచేయాలని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి డిమాండ్ చేశారు. రాజ్యాంగ సవరణకు అనుగుణంగా అగ్రవర్ణ పేదలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఏపీపీయస్సీ ఇటీవల భర్తీ చేసిన ఉద్యోగాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు లేక అగ్రవర్ణాల్లో పేద అభ్యర్థులు నష్టపోయారని అన్నారు.
త్వరలో వైద్యారోగ్య శాఖలో భర్తీ చేసే పోస్టుల్లో అయినా.. రిజర్వేషన్లు అమలయ్యేలా చూడాలని తులసిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ తరహాలో రాష్ట్రంలోనూ పదో తరగతి పరీక్షలు రద్దు చేసి విద్యార్థులను ప్రమోట్ చేయాలన్నారు.
ఇదీ చూడండి..