తెలంగాణలోని నాగార్జునసాగర్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు ఇంద్రసేనా రెడ్డి భాజపా తీర్ధం పుచ్చుకున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన ఓ సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి తరుణ్ చుగ్, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరారు.
కాంగ్రెస్ నేత జానారెడ్డి రెడ్డి ముఖ్య అనుచరుడిగా పేరొందిన ఇంద్రసేనా రెడ్డి గత ఏడాది జరిగిన ప్రాథమిక వ్యవసాయ కేంద్రాల ఎన్నికల సమయం నుంచి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. కొత్తపల్లి ప్యాక్స్ ఛైర్మన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా ఇంద్రసేనరెడ్డి తన వర్గంలోని వారికి చైర్మన్ పదవి తెచ్చుకోవడంతో పార్టీ ఆయనను దూరంగా ఉంచింది. నాగర్జున సాగర్ నియోజక వర్గానికి ఉపఎన్నిక జరుగనుండడంతో ఇదే అదునుగా భావించి భాజపాలో చేరారు.
ఇదీ చదవండి: 'ఐటీఐఆర్ ప్రాజెక్టు ఆలస్యానికి కారణం వారి నిర్లక్ష్యమే'