ETV Bharat / city

Yadlapati Venkat Rao: 'నిజాయితీకి చిరునామా.. యడ్లపాటి' - తెదేపా సీనియర్ నేత మృతి పట్ల ప్రముఖుల సంతాపం

తెదేపా సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యడ్లపాటి వెంకట్రావు మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు.

Condolence to tdp senior leader yadlapati venkat rao

author img

By

Published : Feb 28, 2022, 9:48 AM IST

Updated : Feb 28, 2022, 12:43 PM IST

Yadlapati Passes away: యడ్లపాటి వెంకట్రావు మృతి విచారకరమని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. యడ్లపాటి వ్యక్తిగతంగా తనకు ఎంతో ఆత్మీయులని గుర్తు చేసుకున్నారు. నూరేళ్లకు పైబడిన ఆదర్శవంతమైన, పరిపూర్ణ జీవితాన్ని సాగించారని... నిజాయితీకి చిరునామాగా నిలిచారని అన్నారు. వెంకట్రావు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. వారి కుటుంబ సభ్యులకు వెంకయ్యనాయుడు సానుభూతి తెలిపారు.

రాజకీయ కురువృద్ధులు యడ్లపాటి వెంకట్రావు మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం ప్రకటించారు. హైదరాబాద్​లో యడ్లపాటి కుమార్తె నివాసంలో ఆయన భౌతికకాయానికి చంద్రబాబు నివాళుర్పించి.. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కలిగిన యడ్లపాటి జీవితం ఎంతో ఆదర్శమన్నారు. రాజకీయాల్లో అరుదైన వ్యక్తిగా యడ్లపాటి గుర్తుండిపోతారని చెప్పారు.

రైతు నాయకుడు యడ్లపాటి మృతి వ్యక్తిగతంగా తనకు తీరని లోటని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. తన తండ్రి హయాం నుంచి తమ కుటుంబానికి యడ్లపాటితో ప్రత్యేక అనుబంధం ఉందని చెప్పారు. తాను ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న సంగం డెయిరీకి వ్యవస్థాపక అధ్యక్షుడని చెప్పిన ధూళిపాళ్ల.. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ గొప్ప నాయకుడిని కోల్పోయిందన్నారు.

యడ్లపాటి మృతికి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్​, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంతాపం తెలిపారు. యడ్లపాటి జీవితం ప్రతి తరానికి స్ఫూర్తిగా నిలుస్తుందని లోకేష్ అభిప్రాయపడ్డారు. మంత్రిగా, పార్లమెంట్ సభ్యునిగా రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. ప్రజాప్రతినిధిగా ప్రజలకు.. నాయకుడిగా పార్టీకి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని అచ్చెన్న అన్నారు.

యడ్లపాటి వెంకటరావు మృతి పట్ల మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, తెదేపా సీనియర్ నాయకులు నక్కా ఆనంద్ బాబు, యరపతినేని శ్రీనివాసరావు, జీవీ ఆంజనేయులు సంతాపం ప్రకటించారు. యడ్లపాటి పదవులకే వన్నె తెచ్చారని చెప్పారు. సంగం డెయిరీ, జంపని షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటులో యడ్లపాటి కృషి మరువలేనిదని నక్కా ఆనంద్ బాబు అన్నారు.

యడ్లపాటి వెంకట్రావు మృతి బాధాకరమని.. కాంగ్రెస్‌ నేత కేవీపీ. రామచంద్రరావు అన్నారు. యడ్లపాటి భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఆయనతో 1978 నుంచి వ్యక్తిగత అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. యడ్లపాటి లేని లోటు తీర్చలేనిదన్నారు.

యడ్లపాటి వెంకట్రావు మృతికి తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, మాజీ మంత్రులు కళా వెంకట్రావు, కామినేని శ్రీనివాస్, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, తెదేపా సీనియర్ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి సంతాపం తెలిపారు. రైతు నాయకులు, తెలుగుదేశం పార్టీలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా, తెలుగు రైతు అధ్యక్షునిగా, జిల్లా పరిషత్ చైర్మన్‌గా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి విశేష సేవలందించి, పదవులకే వన్నె తెచ్చిన యడ్లపాటి మృతి పార్టీకి తీరని లోటన్నారు.

ఇదీ చదవండి:

Condolence to yadlapati venkat rao: తెదేపా సీనియర్ నేత కన్నుమూత

Last Updated : Feb 28, 2022, 12:43 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.