ETV Bharat / city

COMMERCIAL TAXES: నిర్దేశిత లక్ష్యం కంటే రూ.పదివేల కోట్ల అదనపు రాబడి!

తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ(Commercial Taxes Department) అయిదు నెలల్లోనే నిర్దేశిత లక్ష్యంలో సగం మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు తెచ్చి పెట్టింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కరోనా ప్రభావం ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం క్రమంగా పెరుగుతూ వస్తోంది. ఇదే స్థాయిలో రాబడులు వచ్చినట్లయితే నిర్దేశిత లక్ష్యం కంటే కనీసం పదివేల కోట్లు అదనంగా రాబడి (Additional income) వచ్చే అవకాశం ఉందని వాణిజ్య పన్నుల శాఖ అంచనా వేస్తోంది.

commercial-taxes-increased-in-telangana-for-the-last-five-months
నిర్దేశిత లక్ష్యం కంటే రూ.పదివేల కోట్ల అదనపు రాబడి!
author img

By

Published : Sep 7, 2021, 7:29 AM IST

రెండో దశ కరోనా విజృంభించినప్పటికీ లాక్‌డౌన్‌ విధించకపోవడంతో వాణిజ్య పన్నుల రాబడులపై ఆ ప్రభావం పెద్దగా పడలేదు. పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలపై వచ్చే వ్యాట్‌(VAT), వస్తుసేవల పన్ను రాబడులు ఆశించిన స్థాయిలోనే వచ్చాయి. అంతకు ముందు ఆర్థిక ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు వచ్చిన ఆదాయంతో పోలిస్తే రెట్టింపు, అంతకు మించి రాబడులు వచ్చాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.47,658 కోట్లు రాబడి రాగా 2021-22 ఆర్థిక ఏడాదికి రూ.52,436 కోట్లు లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించింది. అంటే అంతకు ముందు వచ్చిన రాబడులపై పదిశాతం అదనంగా కలిపి లక్ష్యంగా నిర్దేశించినట్లు వాణిజ్య పన్నుల శాఖ(Commercial Taxes Department) అధికారులు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో గడిచిన అయిదు నెలల్లో వ్యాట్‌, జీఎస్టీల కింద రూ.24,712 కోట్లు మేర రాబడులు వచ్చాయి. ఇది ఈ ఆర్థిక ఏడాది నిర్దేశించిన లక్ష్యంలో దాదాపు సగమని చెప్పొచ్చు.

109 శాతం ఎక్కువ ఆదాయం..

ఈ ఆర్థిక ఏడాదిలో ఆగస్టు చివర వరకు వచ్చిన వ్యాట్‌ రాబడులను ఒకసారి పరిశీలిస్తే.. గత ఆర్ధిక ఏడాది ఆరంభంలోనే కరోనా విజృంభించడం, లాక్‌డౌన్‌ విధించడంతో వాహన రాకపోకలు స్తంభించాయి. దీంతో పెట్రోల్‌, డీజిల్‌ విక్రయాలు భారీగా పడిపోయాయి. పెట్రోలియం ఉత్పత్తులు అమ్మకం ద్వారా వచ్చిన వ్యాట్‌ రాబడులు కూడా అదే స్థాయిలో తగ్గాయి. 2020-21 ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు నెల చివర వరకు కేవలం రూ.2,511 కోట్లు వ్యాట్‌ రాబడి వచ్చింది. ఈ ఆర్థిక ఏడాది అదే సమయంలో.. ఏకంగా రెట్టింపునకు మించి రూ.5,238 కోట్లు రాబడి వచ్చి 109 శాతం ఎక్కువ ఆదాయం వచ్చినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. మద్యం విక్రయాలపై వ్యాట్‌ ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరం మొదటి అయిదు నెలల్లో రూ.3,670 కోట్లు రాబడి రాగా ఈ ఆర్థిక ఏడాది గడిచిన అయిదు నెలల్లో రూ.5,295.30 కోట్లు మేర ఆదాయం వచ్చి 44 శాతం వృద్ధి కనపరచింది.

రూ.2,838.49 కోట్లు మేర పరిహారం

ఇక జీఎస్టీ, ఐజీఎస్టీ, ఐజీఎస్టీ సెటిల్‌మెంట్‌, ఇతర రాబడులను పరిశీలిస్తే.... 2020-21 ఆర్థిక ఏడాదిలో మొదటి అయిదు నెలల్లో రూ.7,026 కోట్లు రాబడి రాగా ఈ ఆర్థిక ఏడాది ఆగుస్టు చివర వరకు రూ.11,338.93 కోట్లు ఆదాయం వచ్చింది. అంటే అంతకు ముందు ఏడాది కంటే 61శాతం వృద్ధి కనపరిచింది. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన బెంచ్‌మార్క్‌ కంటే తక్కువ జీఎస్టీ రాబడులు వచ్చినట్లయితే ఆ తగ్గిన మొత్తాన్ని కేంద్రం పరిహారం పేరుతో రాష్ట్రాలకు భర్తీ చేస్తోంది. జిఎస్టీ అమలులోకి వచ్చిన తరువాత అయిదేళ్లపాటు ఈ పరిహారం చెల్లింపు కొనసాగనుంది. అందులో భాగంగా గత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు కేవలం రూ.791 కోట్లు పరిహారం కింద రాగా...ఈ ఆర్థిక ఏడాది అదే అయిదు నెలల్లో రూ.2,838.49 కోట్లు మేర పరిహారం రాష్ట్రానికి వచ్చింది.

78శాతం వృద్ధి..

కరోనా రెండో దశ తీవ్రంగా ఉన్నప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు చివర వరకు వచ్చిన రాబడుల తీరును పరిశీలించినట్లయితే.. 2020-21 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌లో కేవలం రూ.933 కోట్లు రాగా ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్‌లో ఏకంగా రూ.4,675.55 కోట్లు వచ్చి 401శాతం అధిక రాబడి వచ్చింది. అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం మే నెలలో రూ.1,567 కోట్లు రాబడి రాగా ఈ ఏడాది మే నెలలో రూ.3,618.94 కోట్లు రాబడి వచ్చి 131శాతం వృద్ధి నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం జూన్‌లో రూ.3,777 కోట్లు మేర ఆదాయం రాగా...ఈ ఏడాది జూన్‌ నెలలో రూ.4,521.83 కోట్లు ఆదాయం వచ్చి 20శాతం వృద్ధి కనపరిచింది. గత ఏడాది జులై నెలలో 3,786 కోట్లు రాబడి రాగా ఈ ఏడాది జులై నెలలో ఏకంగా రూ.6,722.14 కోట్లు రాబడి వచ్చి 78శాతం వృద్ధి నమోదు చేసింది.

కనీసం రూ.60 వేల కోట్లు ఆదాయం..

గత ఏడాది ఆగస్టులో రూ.3,935 కోట్లు ఆదాయం రాగా ఈ ఏడాది ఆగస్టులో రూ.5,173.25 కోట్లు ఆదాయం వచ్చి 31శాతం అదనంగా వచ్చింది. మొత్తం మీద గత ఆర్థిక సంవత్సరం అయిదు నెలల్లో వచ్చిన రాబడులతో ఈ ఆర్థిక సంవత్సరం అదే సమయంలో వనకూడిన ఆదాయంతో పోలిస్తే 77శాతం అధికమని వాణిజ్య పన్నుల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆగస్టు నెలలో వచ్చిన మాదిరిగా రాబోవు ఏడు నెలల్లో ఆదాయం వచ్చినట్లయితే ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం మొత్తం కంటే ఎక్కువ మొత్తం వస్తుందని కనీసం 60 వేల కోట్లు ఆదాయం వనకూడుతుందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ తాత్కాలికమేనా? : కాంట్రాక్టు ఉద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.