ETV Bharat / state

నెయ్యి వారే తెచ్చారా లేక వేరొకరు సరఫరా చేశారా? - ఆరా తీస్తున్న సిట్ - SIT INQUIRY ON TIRUMALA LADDU

తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారంపై సిట్ విచారణ వేగవంతం - సీజ్‌ చేసిన దస్త్రాలు తిరుపతి కోర్టులో సమర్పణ

SIT Investigation on Adulterated Ghee in Thirumala
SIT Investigation on Adulterated Ghee in Thirumala (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 12:36 PM IST

SIT Investigation on Adulterated Ghee in Thirumala : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగించిన విషయమై సీబీఐ నేతృత్వంలోని సిట్‌ బృందం క్షేత్ర స్థాయిలో దర్యాప్తు ముమ్మరం చేసింది. నెయ్యి ఒప్పందాన్ని దక్కించుకున్న సంస్థనే తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)కు నేరుగా సరఫరా చేసిందా? లేక ఇతర కంపెనీల నుంచి తెచ్చి ఇచ్చిందా? అనేది పరిశీలన చేస్తోంది. ఇప్పటికే ఏఆర్‌ డెయిరీతో పాటు వైష్ణవి డెయిరీలను పరిశీలించి వచ్చిన సిట్‌ అధికారులు ఆ సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు.

తిరుమల శ్రీవారి హుండీలో నగదు చోరీ

టెండరు సమయంలో టీటీడీ పేర్కొన్న నిబంధనలు ఏమిటి? ఆయా సంస్థల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే విషయాల్నీ సరిచూస్తున్నారు. నెయ్యి సరఫరాకు ఆయా సంస్థలకు ఏ మేరకు ఉత్పత్తి సామర్థ్యం ఉండాలని టీటీడీ నిర్ణయించింది, ఎంత ఉందని తమ పరిశీలనలో తేలిందో అధికారులు సరి చూశారు. ఏఆర్‌ డెయిరీ, వైష్ణవి డెయిరీ నుంచి నెయ్యి సేకరించి టీటీడీకు సరఫరా చేస్తుందన్న విషయమై కూడా అధికారులు ఇప్పటికే కొంత సమాచారం సేకరించారు. తాము సరఫరా చేస్తున్న నెయ్యి నాణ్యతతో ఉన్నట్లు ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌ ధ్రువీకరించిందని ఏఆర్‌ డెయిరీ పేర్కొంటున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహించిన తేదీలను అధికారులు పరిశీలిస్తున్నారు. సీజ్‌ చేసిన దస్త్రాలను తిరుపతి కోర్టులో సమర్పించారు.

ఏఆర్ డెయిరీలో సిట్ తనిఖీలు- తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో క్షేత్రస్థాయిలో దర్యాప్తు

దినుసుల వినియోగం, నాణ్యతపై ఆరా : తమిళనాడు రాష్ట్రం దిండుక్కల్‌లోని ఏఆర్‌ డెయిరీ, శ్రీకాళహస్తి ప్రాంతంలోని వైష్ణవి డెయిరీలతో పాటు చెన్నైలోని ఎస్‌ఎంఎస్‌ ల్యాబ్‌ నుంచి స్వాధీనం చేసుకున్న కీలక దస్త్రాలను సిట్‌లోని 2 బృందాలు తిరుపతిలోని కార్యాలయంలో నిశితంగా పరిశీలించాయి. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం వైష్ణవి డెయిరీకి లేదని, ఈ డెయిరీ నిర్వాహకులు 2 ఇతర డెయిరీల నుంచి నెయ్యి సేకరించి, టీటీడీకి సరఫరా చేసినట్లు, అదీ నాణ్యతా లోపంగా ఉందని గుర్తించినట్లు తెలిసింది. సిట్‌లోని డీఎస్పీ స్థాయి అధికారులు సోమవారం తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం లడ్డూ పోటులో కొందరు సిబ్బందితో మాట్లాడారు. లడ్డూ తయారీలో నెయ్యి, ఇతర దినుసుల వినియోగం, నాణ్యతపై వారు ఆరా తీశారు.

తిరుమలలో సిట్ బృందం - కల్తీ నెయ్యి వ్యవహారంపై విచారణ ప్రారంభం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.