ETV Bharat / city

Coal Crisis: విద్యుత్ సంక్షోభం, బొగ్గు కొరతకు ప్రధాన కారణమేంటి? కేంద్రం ఏం చెబుతోంది? - coal shortage in all over india

బొగ్గు సంక్షోభం తీవ్రస్థాయిలో ఉరుముతోంది. అకాల విద్యుత్‌ కోతలు ఏం జరుగుతుందోనన్న అయోమయంలో పడేస్తున్నాయి. కొరత మరింత పెరిగితే చీకట్లే అన్న హెచ్చరికలు సమస్య తీవ్రత చెప్పకనే చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా సగానికి పైగా థర్మల్ విద్యుత్‌ కేంద్రాల వద్ద బొటాబొటి నిల్వలే అని చెబుతున్నాయి. ప్రస్తుతం విద్యుదుత్పత్తికి సంబంధించి బొగ్గు సరఫరాలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నిజంగా అంత కలవరపడాల్సినవేనా? అనవసరంగా ఆందోళన చెందుతున్నామా? కేంద్రం ప్రభుత్వం ఏం చెబుతోంది?

Coal Crisis
Coal Crisis
author img

By

Published : Oct 12, 2021, 11:20 AM IST

థర్మల్‌ విద్యుత్‌ కేంద్రా(Thermal power plants)ల్లో బొగ్గు కొరత(coal shortage in india)కు పాత బకాయిలు కొండలా పేరుకుపోవడమూ ప్రధాన కారణాల్లో ఒకటని కేంద్ర నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. గనుల నుంచి బొగ్గు కొంటున్న విద్యుత్‌ కేంద్రాల (Thermal power plants) యాజమాన్యాలు రూ.వందల కోట్ల సొమ్ము బాకీ పడ్డాయి. ఒక్క సింగరేణి గనులకే 5 రాష్ట్రాల యాజమాన్యాలు రూ.5 వేల కోట్ల వరకూ బకాయిలు చెల్లించాల్సి ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. దేశంలో కోల్‌ ఇండియా సహా పలు బొగ్గు గనులకు రావాల్సిన బకాయిలు రూ.వేల కోట్లకు చేరినట్లు అంచనా. బకాయిలు పెరగడం వల్ల ఏయే విద్యుత్‌ కేంద్రానికి బొగ్గు సరఫరాను గనులు తగ్గించాయనే సమాచారాన్ని కేంద్ర విద్యుత్‌శాఖ తాజాగా వెల్లడించింది.

నివేదిక

నెలల తరబడి క్రమంగా సరఫరా తగ్గిస్తూ రావడం వల్ల పలు విద్యుత్‌ కేంద్రాల్లో నిల్వలు అడుగంటినట్లు(coal shortage in india) సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌లో విద్యుత్‌ కేంద్రాలకు (Thermal power plants) బొగ్గు కొరత(coal shortage in india) తీవ్రంగా ఉంది. కొన్ని ప్రధాన కేంద్రాలు బొగ్గు కొన్న సొమ్ము చెల్లించనందునే సరఫరా తగ్గినట్లు కేంద్ర విద్యుత్‌శాఖ స్పష్టం చేసింది. ఏపీలోని 3 కేంద్రాలు బొగ్గు కొన్న సొమ్మును సకాలంలో చెల్లించనందునే సరఫరా తక్కువగా ఉన్నట్లు తెలిపింది. తెలంగాణ థర్మల్‌ కేంద్రాలు (Thermal power plants) కూడా సింగరేణి సంస్థకు బకాయిలు చెల్లించాల్సి ఉన్నా బొగ్గు సరఫరా కొనసాగుతోంది.

వడ్డీలపై వివాదాలు

బొగ్గు కొనే సమయంలో ఎన్ని రోజుల్లోగా డబ్బు చెల్లిస్తామో తెలుపుతూ గనులతో థర్మల్‌ కేంద్రం(Thermal power plants) యాజమాన్యం ఒప్పందం చేసుకుంటుంది. ఏపీ, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల విద్యుత్‌ కేంద్రాలు ఈ గడువును పాటించకపోవడంతో గనులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాయి. గడువులోగా సొమ్ము చెల్లించకపోతే బకాయిలపై గనుల యాజమాన్యం వడ్డీ వసూలు చేస్తుంది. ఈ వడ్డీలే రూ.వందల కోట్లకు చేరాయి. వడ్డీలు కట్టలేమని, వాటిని మాఫీ చేస్తే అసలు సొమ్ము చెల్లిస్తామని కొన్ని యాజమాన్యాలు బేరమాడుతున్నాయి. ఈ వివాదాలు తేలక బకాయిలు వడ్డీలు సహా కొండల్లా పేరుకుపోతున్నందున బొగ్గు సరఫరా తగ్గిస్తున్నట్లు బొగ్గు గనుల సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇప్పటికిప్పుడు బకాయిలు చెల్లించేంత ఆర్థిక స్థోమత థర్మల్‌ కేంద్రాల(Thermal power plants)కు గాని, బొగ్గు ఉత్పత్తిని పెంచే సామర్థ్యం గనుల యాజమాన్యాలకు గానీ లేనందున సరఫరా ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు లేవని ఆయన వివరించారు. ఏ థర్మల్‌ కేంద్రాని(Thermal power plants)కి ఏ రోజు ఎంత సరఫరా చేశారు, ఎంత సొమ్ము రావాలనే వివరాలను గనుల యాజమాన్యాలు, ఏ గని నుంచి ఎంత బొగ్గును కొన్నారు, ఎంత చెల్లించాలనే వివరాలను విద్యుత్‌ కేంద్రాల వెబ్‌సైట్లలో పొందుపరిస్తే అసలు సమస్య ఏమిటో అందరికీ తెలిసిపోతుందని పేర్కొన్నారు.

ఇదీ చూడండి: భారీగా పెరిగిన బంగారం ధర- తెలంగాణ, ఏపీలో రేట్లు ఇలా..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.