సీఎం జగన్, మంత్రులు వెల్లంపల్లి, కొడాలి నాని, తితిదే ఛైర్మన్, ఈవో వారి పదవులు, పోస్టుల్లో ఏ అధికారంలో కొనసాగుతున్నారో వివరణ కోరాలని హైకోర్టును అభ్యర్థిస్తూ దాఖలైన కో-వారెంట్ పిటిషన్ వేరే బెంచ్‌కు బదిలీ కానుంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇవ్వకపోవడం చట్టవిరుద్ధమంటూ ఇటీవల పిటిషన్ దాఖలైంది. డిక్లరేషన్ అవసరం లేదని మంత్రులు మద్దతు పలికారని తితిదే ఛైర్మన్, ఈవో నిబంధనల అమల్లో విఫలమయ్యారని ఈ నేపథ్యంలో వారు తమ పదవులు, పోస్టుల బాధ్యతలు నిర్వర్తించకుండా నిలువరించాలని పిటిషన్‌లో కోరారు. జస్టిస్ ఏవీ శేషసాయి వద్ద మంగళవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చింది. తితిదే ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ తరఫున హాజరవుతున్నట్టు సీనియర్ వైవీ రవిప్రసాద్ తెలిపారు. ఆ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి వ్యాజ్యం వేరే బెంచ్ ముందుకు విచారణకు వచ్చేలా తగిన నిర్ణయం తీసుకునేందుకు దస్త్రాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరికి నివేదించాలని రిజిస్ట్రీని ఆదేశించారు.
ఇదీ చదవండీ... కొవిడ్‌తో సహజీవనం చేస్తూనే అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్