కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కొవిడ్ పట్ల ఉన్న ప్రజలకు భయాందోళనను తొలగించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. 8 జిల్లాలోని కొవిడ్ ఆస్పత్రుల్లో పడకల సంఖ్య పెంచాలని సీఎం ఆదేశించారు. ఐసోలేషన్, ఆక్సిజన్ సదుపాయం మరిన్ని పడకలను పెంచాలని సూచించారు.
కొవిడ్ సోకడం పాపం, నేరం కాదు...వైరస్ ఎవరికైనా వ్యాపిస్తుంది. పరీక్షలకు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. కనీస జాగ్రత్తలు, వైద్యసహాయంతో కోలుకోవడం సులభం. వెంటనే ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సింగ్ పోస్టులను భర్తీ చేయాలి - సీఎం జగన్
ఇదీ చదవండి: