దిశ చట్టం అమలు తీరును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్షించారు. కట్టుదిట్టంగా ఈ చట్టాన్ని అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై.. హోం మంత్రి సుచరిత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ సవాంగ్ తో చర్చించారు. చట్టం చేసినా అమలు కావట్లేదన్న మాట ఎక్కడా రాకూడదని చెప్పారు. 13 కోర్టులకు అవసరమైన బడ్జెట్ వెంటనే కేటాయించాలని అధికారులను ఆదేశించారు. పోలీసు విభాగంలోని ఫోరెన్సిక్ ల్యాబ్ సామర్థ్యం 4 రెట్లు పెంచి,అవసరమైన నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మరో రెండు ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు ముఖ్యమంత్రి అంగీకరించారు.
ఇవీ చదవండి: