ETV Bharat / city

CM directions to collectors: రుణాలపై బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడాలి: జగన్​ - సీఎం జగన్ తాజా వార్తలు

జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్.. బుధవారం వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు. కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మెటల్‌ ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోందని.. వెంటనే ధరలను నిర్ణయించి.. అంతకుమించి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

cm directions to collectors
cm directions to collectors
author img

By

Published : Aug 26, 2021, 6:48 AM IST

జగనన్న కాలనీల్లో ఇళ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు పావలా వడ్డీకి రుణాలిచ్చేలా బ్యాంకర్లతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్‌ ఆదేశించారు. ‘లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చి రిజిస్ట్రేషన్‌ చేశాం. అత్యవసర సమయాల్లో వాటిపై రుణం తెచ్చుకునేలా వెసులుబాటు కల్పించాం. అలా తీసుకునే రుణంపై లబ్ధిదారుడికి పావలా వడ్డీ పడుతుంది. మిగతా వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. రుణ సదుపాయం వల్ల ఇళ్ల నిర్మాణం మరింత ఊపందుకుంటుంది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సెర్ప్‌, మెప్మాల సహకారంతో పావలా వడ్డీ రుణాలు అందుతున్నాయి’ అని జగన్‌ పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులతో స్పందన కార్యక్రమంపై బుధవారం వీడియో సమావేశం నిర్వహించారు. కొన్ని జిల్లాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన మెటల్‌ ధరలను అనూహ్యంగా పెంచారన్న సమాచారం వస్తోందని.. వెంటనే ధరలను నిర్ణయించి.. అంతకు మించి విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.

‘కరోనా మూడో దశ (థర్డ్‌ వేవ్‌) వస్తుందో లేదో తెలీదు కానీ... అందుకు సన్నద్ధంగా ఉండాలి. వైద్యులు, పడకలు, ఆసుపత్రులు, ఆక్సిజన్‌ సిలిండర్లు, కాన్సంట్రేటర్లు సిద్ధం చేసుకోవాలి. విద్యాసంస్థలు ప్రారంభమైనందున.. ఎవరిలోనైనా కొవిడ్‌ లక్షణాలు కనిపిస్తే విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకూ వెంటనే పరీక్షలు నిర్వహించాలి.

* రాష్ట్రంలోని 80 శాతం మంది ప్రజలకు రెండు డోసుల వ్యాక్సిన్‌ పడేంత వరకూ అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటివరకూ 1,90,93,476 మందికి వ్యాక్సిన్‌ వేశాం. 72,18,532 మందికి రెండు డోసులు, 1,18,74,944 మందికి ఒక డోసు పూర్తయ్యింది. వర్షాకాలంలో వచ్చే మలేరియా, టైఫాయిడ్‌, డెంగ్యూ, గన్యా తదితర సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. 15 రోజులకోసారి వీటిపై సమీక్ష నిర్వహించాలి.

* పింఛన్లు, బియ్యం కార్డు, ఆరోగ్య శ్రీ కార్డుకు సంబంధించి 21 రోజుల్లోగా దరఖాస్తుదారుడి అర్హత నిర్ధారించాలి. 90 రోజుల్లోగా వాటిని మంజూరు చేయాలి. ఇళ్ల పట్టాలు, నేతన్న నేస్తం, చేయూత, మత్స్యకార భరోసా తదితర పథకాలకు సంబంధించి అర్హులు ఎవరైనా మిగిలిపోతే మళ్లీ దరఖాస్తు చేసుకోమని చెబుతున్నాం. 90 రోజుల్లోగా అర్హత నిర్ధారించి వారికి ఆరు నెలల్లోగా పథకం మంజూరు చేయాలి.

స్వార్థ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం

ఇటీవల కొన్ని దురదృష్టకర ఘటనలు జరిగినప్పుడు పోలీసులు, కలెక్టర్లు ఎంత బాగా స్పందించినా సరే స్వార్థ ప్రయోజనాల కోసం కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వంపై బురద చల్లాలని ఆరాటపడే వ్యవస్థను చూస్తున్నాం. కొందరు ఆడపిల్లలు, వారి కుటుంబాల గౌరవానికి నష్టం జరుగుతుందని తెలిసీ రాజకీయం చేస్తున్నారు. ఒక ఈవ్‌టీజింగ్‌ కేసులో కానిస్టేబుల్‌ సస్పెండయ్యాడు. ఆ అమ్మాయి, ఆ కుటుంబ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా, వారికి కళంకం తెచ్చేలా సామాజిక మాధ్యమాల్లో కొందరు ప్రచారం చేసి కుటుంబ గౌరవాన్ని బజారులో పెట్టేలా వ్యవహరించారు. కలెక్టర్లు, ఎస్పీలు అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి వక్రీకరణకు తావు ఉండకూడదు.

ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తుల స్వీకరణ

ఇళ్ల స్థలాల కోసం కొత్తగా దరఖాస్తులను స్వీకరించి వారికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న 8వేల దరఖాస్తుల పరిశీలనను వెంటనే పూర్తి చేయాలి. అర్హులుగా గుర్తించిన 1,99,663 మందిలో 56వేల మందికి ప్రస్తుతం ఉన్న లేఅవుట్‌లలో పట్టాలిస్తాం. మరో 1,43,560 మందికి పట్టాలిచ్చేలా చర్యలు తీసుకోవాలి. 15.60 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. ఇప్పటివరకూ 10.11 లక్షలు ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటి ప్రగతిపై కలెక్టర్లు ఎప్పటికప్పుడు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఇళ్లకు సంబంధించి అక్టోబరు 25లోగా అన్ని సన్నాహకాలు పూర్తికావాలి.

ఈ క్రాపింగ్‌ కోసం డాక్యుమెంట్లు డిమాండు చేయొద్దు

ఈ క్రాపింగ్‌ కోసం రైతుల నుంచి ఎలాంటి డాక్యుమెంట్లను డిమాండ్‌ చేయొద్దు. వ్యవసాయ సలహా మండలి సమావేశాల్ని కలెక్టర్లు సమీక్షించాలి. సూక్ష్మ, మధ్య, చిన్న తరహా పరిశ్రమలకు సెప్టెంబరు 3న ప్రోత్సాహకాలను విడుదల చేయబోతున్నాం.

* అక్టోబరు 2 నాటికి 75 శాతం గ్రామ సచివాలయ భవనాల నిర్మాణం, డిసెంబరు 31 నాటికి రైతు భరోసా కేంద్రాలు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణాలను పూర్తి చేయాలి. ఆర్బీకేల నిర్మాణంపై తూర్పుగోదావరి, కర్నూలు, నెల్లూరు, వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ల నిర్మాణంపై కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు ధ్యాస పెట్టాలి. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎంతమంది సిబ్బంది ఉండాలి? ఎంతమంది ఉన్నారు అనే దానిపై 90 రోజుల్లోగా వివరాలు ఖరారు చేసి ఆ మేరకు నియామకాలను పూర్తి చేయాలి’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: JAGANA TOUR: కుటుంబ సమేతంగా సీఎం షిమ్లా పర్యటన

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.