రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్ కేంద్ర హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై డీజీపీ గౌతంసవాంగ్, ఇంటెలిజెన్స్ చీఫ్ మనీష్‌కుమార్‌తో సీఎం జగన్‌మోహన్ రెడ్డి రెండుసార్లు భేటీ అయ్యారు. రమేష్‌కుమార్ కేంద్ర హోంశాఖకు రాసినట్లు ప్రచారంలో ఉన్న లేఖపై చర్చించారని సమాచారం. రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసే విధంగా తీవ్ర పదజాలంతో రాసిన లేఖను సీఎం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ లేఖపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్ డీజీపీని ఆదేశించినట్టు సమాచారం.
ఇవీ చదవండి..