ETV Bharat / city

ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు: కేసీఆర్​ - సీఎం కేసీఆర్​ తాజా వార్తలు

ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించొద్దని ప్రధాని మోదీని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉందని కేసీఆర్​ పేర్కొన్నారు. అలాగే రాష్ట్రాల రుణాలను రీషెడ్యూల్​ చేయాలని, రుణ పరిమితిని పెంచాలని విన్నవించారు. జులై, ఆగస్టు నెలల్లోనే కరోనా వ్యాక్సిన్​ వచ్చే అవకాశముందన్నారు.

ప్రయాణికుల రైళ్లను అప్పుడే పునరుద్ధరించొద్దు: కేసీఆర్​

author img

By

Published : May 11, 2020, 6:48 PM IST

ప్రయాణికుల రైళ్లను ఇప్పుడే పునరుద్ధరించొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్​.. ప్రధాని మోదీని కోరారు. దేశంలోని ప్రధాన నగరాల్లోనే కరోనా ప్రభావం అధికంగా ఉందని కేసీఆర్​ తెలిపారు. రైలు ప్రయాణికులందరినీ క్వారంటైన్‌ చేయడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇప్పుడప్పుడే కరోనా మనల్ని వదిలిపోయేట్టు కనిపించడం లేదన్నారు. ఇక కరోనాతో కలిసి బతకడం మనకు తప్పదన్న కేసీఆర్​.. కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.

అప్పులు చెల్లించే పరిస్థితి లేదు..

కరోనా వల్ల ఈ ఆర్థిక సంవత్సరంపై తీవ్ర ప్రభావం పడిందని.. రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయాలు లేవని సీఎం తేల్చి చెప్పారు. అప్పులు చెల్లించే పరిస్థితి లేనందున రుణాలు రీ షెడ్యూల్ చేయాలని కోరారు. రుణ పరిమితిని పెంచాలని విన్నవించారు. వలస కూలీలను వెళ్లనివ్వకపోతే ఆందోళనలు తలెత్తుతాయని పేర్కొన్నారు. ఏ రాష్ట్రానికి చెందిన వలస కూలీలను ఆ రాష్ట్రం అనుమతించాలన్నారు. కరోనా నివారణ వ్యాక్సిన్‌ కోసం హైదరాబాద్‌ కంపెనీలు కృషి చేస్తున్నాయని పేర్కొన్నారు. జులై, ఆగస్టు నెలల్లోనే కరోనా వ్యాక్సిన్​ వచ్చే అవకాశముందన్నారు.

ఇదీ చూడండి: 'కరోనా ఎక్కువ కాలం ఉంటే.. ఆ సంస్థల పని అంతే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.