తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి శోభ, కూతరు కవిత, ఇతర కుటుంబ సభ్యులు రెండు రోజులపాటు అక్కడ పర్యటించనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సతీమణి శోభ, ఎమ్మెల్సీ కవిత, ఇతర కుటుంబసభ్యులు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిని సందర్శించుకున్నారు. రేపు అక్కడ పర్యటించనున్నారు. ముందుగా అస్సీ ఘాట్ నుంచి దశాశ్వమేధ ఘాట్ వరకు పడవలో ప్రయాణించి.. గంగా హారతి, గంగా పూజ నిర్వహిస్తారు. అనంతరం అస్సీ ఘాట్‌కు తిరుగు ప్రయాణమవుతారు.
ఆ తర్వాత సంకట్మోచన్ హనుమాన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. ప్రత్యేక పూజలు నిర్వహించి.. పట్టువస్త్రాలు సమర్పిస్తారు.
ఇదీ చూడండి: రెండు జిల్లాలో పంచాయతీ ఎన్నికల తేదీలు మార్చిన ఎస్ఈసీ