రీస్టార్ట్ ప్యాకేజీలో భాగంగా సూక్ష్మ,చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రెండో విడత ప్రోత్సాహక బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ చెల్లించనుంది. తాడేపల్లి లోని క్యాంపు కార్యాలయంలో జరిగే కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బకాయిలను విడుదల చేయనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లబ్ధిదారులతో సీఎం మాట్లాడనున్నారు. లాక్‌డౌన్ కారణంగా తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఎంఎస్‌ఎంఈలు గట్టెక్కేందుకు, తిరిగి ఆ సంస్థలు ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక బకాయిలు చెల్లిస్తోంది. రీస్టార్ట్ కార్యక్రమంలో భాగంగా 7వేల717 పరిశ్రమలకు తొలివిడత మే 22 నాడు బకాయిలు విడుదల చేసింది. రెండో విడత ఇవాళ విడుదల చేయనుంది. 2వేల435 ఎంఎస్‌ఎంఈ యూనిట్స్‌కు సంబంధించిన 4వేల 900 క్లెయిమ్స్ ద్వారా ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లబ్ధి చేకూరుతుంది. రెండో విడత బకాయిలు చెల్లింపులు కింద 128 పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు 163 క్లెయిమ్స్‌కు సంబంధించిన 58.97 కోట్లు విడుదల కానున్నాయి. ఎస్సీ, ఎస్టీ, మహిళా పారిశ్రామిక వేత్తల ఆధ్వర్యంలో నడుస్తున్న అన్ని యూనిట్లకూ ప్రత్యేక కేటగిరీ కింద సాయం అందనున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
నేడు ఎంఎస్‌ఎంఈలకు రెండో విడత బకాయిలు విడుదల - ఎమ్ఎస్ఎమ్ఈ న్యూస్ ఏపీ
ఎంఎస్‌ఎంఈలు గట్టెక్కేందుకు, తిరిగి ఆ సంస్థలు ప్రారంభమయ్యేందుకు ప్రభుత్వం ప్రోత్సాహక బకాయిలు చెల్లిస్తోంది. అందులో భాగంగా ఇవాళ రెండో విడత బకాయిలను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.