ETV Bharat / city

SWECHA PROGRAMME: బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం: సీఎం జగన్​

బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే లక్ష్యంగా 'స్వేచ్ఛ' కార్యక్రమం ప్రారంభించినట్లు సీఎం జగన్​ అన్నారు. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న 10 లక్షలమందికి పైగా కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు అందించనున్నట్లు తెలిపారు. శారీరకంగా వచ్చే మార్పులతో కలిగే ఇబ్బందుల వల్ల విద్యార్థినుల విద్య మధ్యలో ఆగిపోకుండా చేయటమే కార్యక్రమ లక్ష్యమన్నారు. విద్యార్థినుల్లో అవగాహన కోసం ప్రతి విద్యా సంస్థలో అధికారులు ప్రత్యేక ఓరియెంటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.

swecha program started by cm jagan
swecha program started by cm jagan
author img

By

Published : Oct 5, 2021, 12:09 PM IST

Updated : Oct 5, 2021, 4:31 PM IST

ప్రభుత్వ పాఠశాలలు, ఇంటర్మీడియట్‌ కళాశాలల్లో చదువుతున్న 10 లక్షల మంది కిశోర బాలికలకు ఉచితంగా శానిటరీ న్యాప్‌కిన్లను అందించే ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని సీఎం జగన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు. 7 నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థినులకు నెలకు 10 చొప్పున న్యాప్‌కిన్లు అందించనున్నారు. ప్రతి 2 నెలలకు ఒకసారి పాఠశాలలకు వెళ్లి విద్యార్థినులకు వీటిని ఇవ్వనున్నారు.

సెలవులుంటే ముందుగానే..

ఒక్కో విద్యార్థినికి నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్​కిన్లు ఉచితంగా అందిస్తామని సీఎం తెలిపారు. ఇందుకోసం రూ. 32 కోట్లు కేటాయించామన్నారు. విద్యా సంస్థలకు సెలవులుంటే ముందుగానే సరిపడా న్యాప్​కిన్లు అందిస్తామని స్పష్టం చేశారు. దిగ్గజ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని వైఎస్సార్ చేయూత దుకాణాల ద్వారా మార్కెట్ కంటే తక్కువ ధరకు నాణ్యమైన బ్రాండెడ్ శానిటరీ న్యాప్​కిన్లను తీసుకునే అవకాశం కల్పించినట్లు సీఎం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు కోటి మంది మహిళల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపుతున్నట్లు తెలిపారు. దేశంలో 23 శాతం మంది చిన్నారులు పాఠశాల విద్య మధ్యలో ఆగిపోతోందన్నారు. ఇలా చదువు ఆగిపోవడానికి ప్రధాన కారణం రుతుక్రమం సమయంలో ఎదురవుతున్న ఇబ్బందులే కారణమని యునైటెడ్ నేషన్స్ వాటర్ సప్లై అండ్ శానిటేషన్ కొలాబరేటివ్ కౌన్సిల్ నివేదికలో స్పష్టంగా వెల్లడించారన్నారు. రాష్ట్రంలో ఈ తరహా పరిస్ధితులు మారాలనే లక్ష్యంతో 'స్వేచ్ఛ' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు సీఎం తెలిపారు.

ప్రత్యేక నిధి ఏర్పాటు

చిన్నారులకు పరిశుభ్రత, ఆరోగ్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్న సీఎం..ఈ దిశగా విద్యాసంస్థల్లో అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 56 వేల 703 ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థల్లో నిరంతరం నీటి సరఫరాతో కూడిన మరుగుదొడ్లను బాలికల కోసం ప్రత్యేకంగా నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాడు-నేడు మొదటి దశలో 15 వేల 715 పాఠశాలల్లో ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణం పూర్తైందని..వచ్చే ఏడాది జూలై నాటికి అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు. టాయిలెట్ల నిర్వహణకు పాఠశాలల్లో హెడ్ మాస్టర్లు, పేరెంట్స్ కమిటీ పర్యవేక్షణలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేసినట్లు సీఎం స్పష్టం చేశారు. పథకం అమలు కోసం ప్రతి పాఠశాల,కళాశాలలో నోడల్ అధికారిగా మహిళా అధ్యాపకురాలిని నియమిస్తున్నట్లు తెలిపారు.

అవగాహన కోసం ఓరియెంటేషన్ కార్యక్రమం

శానిటరీ న్యాప్​కిన్లు ఉచితంగా ఇవ్వడంతో పాటు వినియోగించిన న్యాప్​కిన్లను నిర్వీర్యం చేసే పద్దతుల గురించి కిషోర బాలికలకు అవగాహన కల్పించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. వినియోగించిన న్యాప్​కిన్లు నిర్వీర్యం చేసి పర్యావరణహితంగా మార్చేందుకు క్లీన్ ఆంధ్రప్రదేశ్ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 6,417 ఇన్వినరేటర్లు ఏర్పాటు చేసినట్లు సీఎం తెలిపారు. పిల్లలు తమకున్న ఇబ్బందులపై మాట్లాడుకోవడం తప్పు అనే భావన పోవాలని, ఇలాంటి విషయాల్లో చిన్నారులకు తగిన ఎడ్యుకేషన్ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. శరీరంలో వచ్చే మార్పులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మహిళా అధ్యాపకులు, ఎఎన్​ఎంలు, సచివాలయంలోని మహిళా పోలీసు సిబ్బంది ప్రతి పాఠశాల, కళాశాలలో నెలకోసారి ఓరియెంటేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలన్నారు. ఇదే సమయంలో 'దిశ'యాప్ చట్టం సహా యాప్ డౌన్​లోడ్ చేసుకోవటంపైనా ఓరియెంటేషన్ కార్యక్రమంలో చెప్పాలన్నారు.

'బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే 'స్వేచ్ఛ' లక్ష్యం. 10 లక్షలమందికి పైగా కిశోర బాలికలకు ఉచితంగా న్యాప్‌కిన్లు అందిస్తాం. వినియోగించిన న్యాప్‌కిన్లను డిస్పోజ్‌ చేసే పద్ధతులపై అవగాహన కల్పించాలి. నోడల్‌ అధికారి ద్వారా కిశోర బాలికలకు అవగాహన కల్పిస్తాం. రాష్ట్రవ్యాప్తంగా ఇన్సినరేటర్లు కూడా ఏర్పాటయ్యాయి. చిన్నారుల పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోతోంది. చదువు ఆగడానికి రుతుక్రమం సమయంలో ఇబ్బందులే కారణం. ఇలాంటి పరిస్థితి మారి.. ఇబ్బందులు రాకూడదనే చర్యలు తీసుకుంటున్నాం. శరీరంలో మార్పులు, జాగ్రత్తలపై అవగాహన కల్పించాలి. ప్రతి నెలలో కార్యక్రమం జరిగేలా జిల్లాలో జేసీ పర్యవేక్షించాలి. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ఉచితంగా బ్రాండెడ్ న్యాప్‌కిన్లు ఇవ్వనున్నాం. నెలకు 10 చొప్పున ఏడాదికి 120 శానిటరీ న్యాప్‌కిన్లు అందిస్తాం. స్వేచ్ఛ పథకం అమలుకు నోడల్ అధికారిగా మహిళా అధ్యాపకురాలిని నియమిస్తాం.' -సీఎం జగన్​

పాఠశాల, కళాశాలల్లో జరిగే కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యతను జాయింట్ కలెక్టర్​కు అప్పగిస్తున్నట్లు సీఎం తెలిపారు. చిన్నారులకు పరిశుభ్రత, ఆరోగ్యం కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమని ఈ దిశగా విద్యా శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, వైద్యశాఖల అధికారులు సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు.

ఇదీ చదవండి:

MICROSOFT COURCES: రాష్ట్రంలో 1.62 లక్షల మందికి ఉచిత శిక్షణ

Last Updated : Oct 5, 2021, 4:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.