ETV Bharat / city

వైఎస్​ఆర్ చేయూత, ఆసరాలో ఎక్కడా లోపం రావొద్దు: సీఎం

వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా అమలుపై ముఖ్యమంత్రి జగన్​ సమీక్ష నిర్వహించారు. పథకం అమలులో ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

cm jagan
cm jagan
author img

By

Published : Oct 7, 2020, 7:23 PM IST

వైఎస్‌ఆర్‌ చేయూతలో మహిళలకు ఉపాధి కల్పనపై పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని సీఎం జగన్ తెలిపారు. వైఎస్‌ఆర్‌ చేయూత, వైఎస్‌ఆర్‌ ఆసరా అమలుపై సమీక్ష నిర్వహించిన ఆయన.... పథకం అమల్లో ఎక్కడా లోపం లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి కోరుతున్న మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకుని అభివృద్ధి చెందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు.

కిరాణా షాపుల నిర్వాహకులకు ఏ సమస్య వచ్చినా, ఎవరైనా లంచం అడిగినా, ఫిర్యాదు చేయాలి. ఫోన్‌ చేయాల్సిన నెంబర్ దుకాణం వద్ద ప్రదర్శించాలి. వ్యవస్థలో ఎక్కడా అవినీతికి తావు లేకుండా చూడాలి, లేకపోతే విశ్వాసం కోల్పోతాము. కొత్తగా ఏర్పాటవుతున్న షాపులకు ఒక బ్రాండింగ్‌ తీసుకురావాలి, వాటికి తగిన ప్రాచుర్యం కల్పించాలి. - సీఎం జగన్

పథకం కింద లబ్ధిదారులకు ఇచ్చే ఆవులు, గేదెల కొనుగోలులో నిపుణుల అభిప్రాయం తీసుకోవాలని అధికారులకు సీఎం సూచించారు. పథకంలో ఆవు లేదా గేదె పొందిన వారికి ఆర్బీకేల ద్వారా పశు గ్రాసం కూడా పంపిణీ చేయాలని ఆదేశించారు. స్వయం ఉపాధి కల్పనలో మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు మార్కెటింగ్‌ ఉండాలని దిశానిర్దేశం చేశారు.

ఇదీ చదవండి

పేగు బంధం మరిచి.. ప్రియుడితో కలిసి కన్నకొడుకునే చంపిన తల్లి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.