ETV Bharat / city

'క్షేత్రస్థాయిలోనే ప్రజల ఫిర్యాదులు పరిష్కరించాలి' - ముఖ్యమంత్రి జగన్​ మెహన్ రెడ్డి సమీక్ష

ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు సంబంధించిన లబ్దిదారుల జాబితాను... గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోనే ప్రజల ఫిర్యాదులను పరిష్కారం చేసే దిశగా గ్రామ సచివాలయాలు పనిచేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. త్వరలోనే వాలంటీర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్టు తెలిపారు.

SPANDANA
author img

By

Published : Oct 29, 2019, 10:29 PM IST

Updated : Oct 30, 2019, 12:06 AM IST

స్పందనపై సీఎం సమీక్ష

రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్పందన కార్యక్రమంలో ఎక్కువ ఫిర్యాదులకు పరిష్కారం దొరుకుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ప్రజల వినతుల పరిష్కారంలో గ్రామ సచివాలయాలు కీలకంగా వ్యవహరించాల్సిన అవసరముందని స్పష్టం చేశారు. డిసెంబరు 15 నుంచి సచివాలయాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎస్పీలు, జిల్లా కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. స్పందన కింద ఇప్పటి వరకూ 6 లక్షల 99 వేల 548 ఫిర్యాదులు వస్తే... అందులో అధికంగా ఇళ్ల పట్టాలు, రేషన్ కార్డులు, పెన్షన్ సమస్యలే ఉన్నాయని చెప్పారు. పరిష్కారమైన వినతులు 80 శాతం మేర ఉన్నాయని వివరించారు. ఎక్కడా అవినీతి కనిపించకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్ అధికారులను ఆదేశించారు.
సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితా

గ్రామ సచివాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా ప్రదర్శించాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. దీనివల్ల సోషల్ ఆడిట్ జరుగుతుందని... అర్హులు, అనర్హుల విషయం అక్కడికక్కడే తేలిపోతుందని వివరించారు. ప్రతి గ్రామ సచివాలయం పక్కనే రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు అమ్మేలా ఓ స్టాల్ను ఏర్పాటు చేయాలన్నారు. డిసెంబరు 1 నుంచి వైఎస్ఆర్ లా నేస్తం పథకం కూడా ప్రారంభించనున్నట్టు సీఎం వెల్లడించారు.

నవంబర్ 1నుంచి మెట్రో నగరాల్లో ఆరోగ్యశ్రీ

వైఎస్ఆర్ కంటి వెలుగు రెండో విడత కార్యక్రమం నవంబరు 2 నుంచి మొదలవుతుందని... ఇప్పటికే లక్షల మంది పిల్లలకు కంటి పరీక్షలు పూర్తయ్యాయని సీఎం జగన్ వెల్లడించారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాల్లో ఆరోగ్యశ్రీ అమలు నవంబర్ 1 నుంచి ప్రారంభమవుతుందని వివరించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూడాలని... కొరత ఉందని గుర్తిస్తే ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేయాలని సీఎం ఆదేశించారు. నవంబరు 7న అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేస్తామని తెలిపారు. రూ.10వేల లోపు సొమ్ము కోల్పోయిన 3 లక్షల 69 వేల మందికి రూ.264 కోట్లను చెల్లిస్తున్నామని సీఎం వివరించారు.

మత్స్యకారులకు ఆర్థికసాయం

నవంబర్‌ 21న మత్స్యకారులకు రాయితీపై డీజిల్ ఇచ్చే అంశంతోపాటు ... సముద్రంలో వేటకు వెళ్లే కుటుంబానికి రూ.10వేల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం చెప్పారు. గతంలో మెకనైజ్డు, మోటారైజ్డ్‌ బోట్లకు మాత్రమే ఇచ్చే వారని... ఇప్పుడు సముద్రంలో వేటకు వెళ్లే తెప్పలకూ దీన్ని వర్తింపుచేస్తున్నామన్నారు. 1,32,332 కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని వివరించారు. ముమ్మడివరంలో జరిగే ఈ పథకం ప్రారంభోత్సవంలో తాను పాల్గొంటానని సీఎం జగన్ చెప్పారు.

రూపాయికే రిజిస్ట్రేషన్

ఇళ్లపట్టాల పంపిణీలో భాగంగా ఇప్పటివరకూ 22,79,670 లబ్దిదారులను గుర్తించామని... సాచురేషన్ విధానంలో ప్రతీ ఒక్కరికీ ఇంటిస్థలం ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. దేశమంతా ఈ పథకం వైపు చూస్తోందన్నారు. మహిళల పేరుపై రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామని అధికారులకు వివరించారు. పట్టణ ప్రాంతాల్లో అభ్యంతరంలేని చోట 2 సెంట్ల భూమి వరకూ రూపాయికే రిజిస్ట్రేషన్‌ చేయిస్తామని చెప్పారు. 2 సెంట్ల నుంచి 6 సెంట్ల వరకూ నిర్దేశిత విలువ ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించటంపై ప్రతిపాదనలు తయారుచేయన్నామని సీఎం వివరించారు. కాల్వగట్లమీద, నదీ తీరప్రాంతాల్లో ఉంటున్న వారికి మొదటి విడతలోనే ఇళ్లు కట్టించి... వారిని తరలించాలన్నారు.

మరోసారి వాలంటీర్ల భర్తీ

గ్రామవాలంటీర్ల వ్యవస్థలో ఏర్పడిన ఖాళీలను భర్తీ చేయనున్నట్టు సీఎం జగన్ తెలిపారు. మొత్తం 27 వేల ఖాళీలు తర్వలోనే భర్తీ అవుతాయన్నారు. రైతు భరోసా మిగిలిన ధరఖాస్తులను నవంబరు 15లోగా పంపాలని ముఖ్యమంత్రి సూచించారు. 1.87లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాలు మూతపడ్డాయని... 4.89 లక్షల మంది ఖాతాలకు ఆధార్ తప్పుగా సీడింగ్ అయ్యిందన్నారు. మరోవైపు విత్తనాలు, ఎరువుల విక్రయాలపై దృష్టి పెట్టాలని... కల్తీ లేకుండా చూడాలని ఆదేశించారు.

sample description
Last Updated : Oct 30, 2019, 12:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.