ETV Bharat / city

రైతులకు విద్యుత్‌ బిల్లుల సమస్య ఉండదు: సీఎం జగన్ - jagan comments farmers

మీటర్ల ద్వారా ఫీడర్లపై భారం ఎంతో తెలుస్తుందని సీఎం జగన్ పేర్కొన్నారు. ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తుందని... అన్నదాతలకు విద్యుత్‌ బిల్లుల సమస్య ఉండదని స్పష్టం చేశారు. వచ్చే 30 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వివరించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

CM Jagan Review On Rythu Bharosa centre
సీఎం జగన్
author img

By

Published : Sep 10, 2020, 7:07 PM IST

గోదాముల వద్దే జనతా బజార్ల ఏర్పాటుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మొత్తం 13 రకాల సదుపాయాలు కల్పించాలని సీఎం స్పష్టం చేశారు. రైతు భరోసా కేంద్రాల వద్ద మౌలిక సదుపాయాల కల్పనపై సీఎం సమీక్షించారు. మంత్రి కన్నబాబు, వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ నాగిరెడ్డి సమీక్షకు హాజరయ్యారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రూ.6 వేల కోట్లతో సౌకర్యాల కల్పనపై చర్చించారు. ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాల బలోపేతానికి చర్యలపైనా చర్చ జరిగింది. పీఏసీఎస్‌ల ముందున్న సవాళ్లు, పరిష్కార మార్గాలపై ముఖ్యమంత్రి జగన్ చర్చించారు.

పీఏసీఎస్‌ల బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే ఏర్పాటైన కమిటీ నివేదిక పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఆర్‌బీకేల బలోపేతానికి తగిన మౌలిక సదుపాయాలు ఉండాలన్న సీఎం... నాణ్యమైన పరికరాలు, విత్తనాలు, ఎరువులు ఉండాలని చెప్పారు. రైతుల ఆదాయం రెట్టింపునకు ఈ–మార్కెట్‌ అందుబాటులోకి రావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

జనతా బజార్లు, షెడ్యూలింగ్, సెకండరీ ప్రాసెసింగ్‌పై ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. పంటలకు కనీస మద్దతు ధరలపై కసరత్తు చేయాలని సీఎం నిర్దేశం చేశారు. నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలంటే మీటర్లు ఉండాలన్న సీఎం జగన్... మీటర్ల ద్వారా ఫీడర్లపై భారం ఎంతో తెలుస్తుందని వివరించారు. ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో డబ్బు జమ చేస్తుందని చెప్పారు. రైతులకు విద్యుత్‌ బిల్లుల సమస్య ఉండదన్న ముఖ్యమంత్రి జగన్... వచ్చే 30 ఏళ్ల వరకు ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

మూడు రాజధానులు తప్పు లేదు.. హైకోర్టులో కేంద్రం అఫిడవిట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.