ETV Bharat / city

CM Jagan Review: 'ఫౌండేషనల్ స్కూళ్ల తర్వాత డిజిటల్‌ బోధనపై దృష్టి పెట్టాలి' - AP News

ప్రాథమిక విద్యను బలోపేతం చేసేందుకు ఫౌండేషనల్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని... సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. డిజిటల్ బోధనను అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పుడు ఏర్పాటు చేసే ఫౌండేషనల్‌ స్కూళ్లు అన్నీ కిలోమీటర్‌ దూరం లోపల ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3వ తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి అన్ని హైస్కూళ్లు 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలని నిర్దేశించారు. వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా ఉండాలని...ఆ విధంగా స్కూళ్ల మ్యాపింగ్‌ చేయాలని సీఎం జగన్ సూచించారు.

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి
author img

By

Published : May 27, 2021, 7:53 PM IST

ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి

విద్యా శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు(CM Jagan Review). తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, మహిళా సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత, ఆయా శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రీప్రైమరీ, ప్రైమరీ విద్యార్థులకు గట్టి పునాదులు వేసేందుకు చేసిన ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి జగన్ సమగ్రంగా చర్చించారు. పిల్లల్లో 6 ఏళ్ల వయసులోపే 80 శాతం మేథో వికాసం చెందుతుందన్న సీఎం... నిరుపేద విద్యార్థులకు అత్యుత్తమ ప్రమాణాలతో విద్య అందించాలని తన తపన, ఆరాటమన్నారు. ఆ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చినవే వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లు, ఫౌండేషనల్‌ స్కూళ్లు అని స్పష్టం చేశారు.

కిలోమీటర్‌ దూరం లోపే ఉండాలి..

అన్ని వసతులతో విద్యార్థులకు మంచి విద్యాభ్యాసం కోసమే మనబడి, నాడు-నేడు చేపట్టామమన్న సీఎం... ఈ కార్యక్రమంలో భాగంగా, స్కూళ్ల రూపురేఖలనే సమూలంగా మార్చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు ఏర్పాటు చేయాలనుకున్న ఫౌండేషనల్‌ స్కూళ్లు అన్నీ ఒక కిలోమీటర్‌ దూరం లోపల ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 3 తరగతి నుంచి 10 లేదా 12వ తరగతి అన్ని హైస్కూళ్లు 3 కిలోమీటర్ల దూరం లోపల ఉండాలని నిర్దేశించారు. వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లు పిల్లలకు చాలా దగ్గరగా ఉండాలని ... ఆ విధంగా స్కూళ్ల మ్యాపింగ్‌ చేయాలని సీఎం సూచించారు.

ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చు..

టీచర్లలోని బోధనా సామర్థ్యాని మరింత వినియోగించుకునేలా తగిన హేతుబద్ధీకరణ చేపట్టాలని, తద్వారా పిల్లలకు ఇంకా అత్యుత్తమ విద్యను అందించవచ్చుని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కొత్త ప్రతిపాదనల అమలు వల్ల ఎలాంటి ప్రభావం ఉండబోతుందన్న దానిపై పూర్తిస్థాయిలో అధికారులు ఆలోచనలు చేయాలన్నారు. తదుపరి సమీక్షలో నివేదించాలని సీఎం ఆదేశించారు. ఒకవేళ వాటిని అమలు చేయాల్సిన పక్షంలో ముందుగా 3, 4, 5 తరగతులను యూపీ స్కూళ్లకు, హైస్కూళ్లకు బదిలీ చేయాల్సి ఉంటుందన్నారు. ఇవన్నీ ఖరారైన తర్వాత ఫౌండేషనల్‌ స్కూళ్లలో చేపట్టాల్సిన నాడు-నేడు కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని నిర్దేశించారు.

బ్లాక్‌ బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డ్స్‌కు..

స్థానిక ప్రాథమిక పాఠశాలలో అంగన్‌ వాడీలు , 1, 2 తరగతుల ఫౌండేషనల్‌ స్కూళ్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఫౌండేషనల్ స్కూళ్ల ఏర్పాటు తర్వాత డిజిటల్‌ బోధన ప్రక్రియపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఆ మేరకు డిజిటల్‌ బోధనా పద్ధతులు రూపొందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బ్లాక్‌ బోర్డు నుంచి గ్రీన్‌ బోర్డ్స్‌కు మారామని, ఇక ముందు డిజిటల్‌ బోర్డ్స్‌కు వెళ్లే పరిస్థితి వస్తుందని సీఎం వ్యాఖ్యానించారు. ఏర్పాటు చేసే పరికరం ఒక రోబస్ట్‌గా ఉండాలన్న సీఎం... మరమ్మతులకు అవకాశం తక్కువగా ఉండే పరికరాలను గుర్తించాలని సూచించారు. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని పరిశీలన చేయాలని ఆదేశించారు.

ప్రతి మండలానికీ ఒక జూనియర్‌ కాలేజీ..

డిజిటల్ పరికాలు ఎన్ని పాఠశాలలు, తరగతి గదుల్లో ఏర్పాటు చేయగలం..? ఎంత వ్యయం అవుతుందో సమీక్షించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రతి మండలానికీ ఒక జూనియర్‌ కాలేజీ పెట్టాలనుకున్నామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లలో 11, 12 తరగతులను పెట్టడమా..? లేక మండలానికి ఒక జూనియర్‌ కాలేజీని పెట్టాలా..? అనే విషయమై ఆలోచించాలని అధికారులకు సూచించారు. కొన్ని మండలాల్లో అవసరాల మేరకు 2 జూనియర్‌ కాలేజీలు పెట్టాలా..? అనే దానిపై పూర్తి స్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు. ఈ నిర్ణయం వల్ల 11, 12 తరగతులకు ప్రభుత్వ రంగంలోనే మంచి విద్య అందించే అవకాశం ఉంటుందన్నారు.

యథావిథిగా వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ..

తమ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మెదడు బాగా అభివృద్ధి చెందే 3 నుంచి 8 ఏళ్ల మధ్య ఉన్న చిన్నారులపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. టీచర్లను సమర్థవంతంగా వినియోగించుకోడం, ప్రీప్రైమరీ, ప్రెమరీ విద్యార్థులకు ఉత్తమ విద్యాబోధన తదితర అంశాలే లక్ష్యాలుగా సరికొత్త ఆలోచనలు చేయాలని సీఎం నిర్దేశించారు. దీంట్లో భాగంగానే ఫౌండేషనల్‌ స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి మాదిరిగానే యథావిథిగా ఆ స్కూళ్లలో వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ అమలు చేయాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ... రాష్ట్రంలో ప్రతి విద్యార్థి భవిష్యత్​కు భరోసా: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.