ETV Bharat / city

వచ్చే వేసవిలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు చేపట్టండి: సీఎం జగన్ - Power Holiday Continuation for Industries

రాష్ట్రంలో విద్యుత్ కొరత నివారణకు.. తక్షణం రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్థ్యాలు జోడించాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్‌ సరఫరాకు మళ్లీ చర్యలు తీసుకోవాలన్న సీఎం.. వచ్చే వేసవిలో కోతల సమస్యలు రాకుండా పారిశ్రామిక రంగ వ్యక్తులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలని నిర్దేశించారు.

CM Jagan review on power
CM Jagan review on power
author img

By

Published : May 4, 2022, 4:19 PM IST

Updated : May 4, 2022, 8:28 PM IST

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా, వినియోగం, భవిష్యత్‌లో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సమీక్షించారు. బొగ్గు సరఫరాలో అంతరాయంతో పలు రాష్ట్రాల్లో.. తీవ్ర కొరత ఉందని అధికారులు సీఎంకు వివరించారు. సరిపడా రైల్వే ర్యాక్స్‌ సరఫరా చేయలేకపోవడం, విదేశాల్లోనూ బొగ్గు ధరలు విపరీతంగా పెరగడం వంటి కారణాలన్నీ కరెంటు కొరతకు దారితీశాయన్నారు. డిమాండు కూడా గతం కన్నా అనూహ్యంగా పెరిగిందన్నారు. వ్యవసాయరంగం నుంచి డిమాండ్‌ స్థిరంగా ఉందని.., కొవిడ్‌ తర్వాత పారిశ్రామిక ఉత్పత్తిరంగం పుంజుకుందని.., వేసవి ఉష్ణోగ్రతలు కూడా అధికస్థాయిలో ఉన్నందున వినియోగం ఎక్కువగా ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఏప్రిల్‌ 8న రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా 12 వేల 293 మిలియన్‌ యూనిట్ల డిమాండ్‌ నమోదైందన్న అధికారులు.. మార్చిలో సగటున రోజుకు 36.5 కోట్లు, ఏప్రిల్‌లో 34.08 కోట్లు వెచ్చించి కరెంటు కొన్నామని వివరించారు. బొగ్గు సరఫరాలో వచ్చే రెండేళ్లు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయనే సంకేతాలు కేంద్రం నుంచి అందాయని, జనరేషన్‌ ప్లాంట్లకు కావాల్సిన బొగ్గులో.. కనీసం 10 శాతం వరకూ విదేశాల నుంచి తెచ్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కిచెప్తున్నారని వెల్లడించారు.

డిమాండ్‌ను అంచనా వేసుకుని.., బొగ్గు కొనుగోలుపై ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సీఎం జగన్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. సెకీతో ఒప్పందం కారణంగా సుమారు 45 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌.. 2023 నాటికి రాష్ట్రంలో దశలవారీగా అందుబాటులోకి వస్తుందని సీఎం వెల్లడించారు. ఇక కృష్ణపట్నం, వీటీసీఎస్‌లో కొత్తగా 800 మెగావాట్ల చొప్పున ధర్మల్‌ విద్యుత్‌ యూనిట్లు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. సీలేరులో 1350 మెగావాట్ల కొత్త ప్రాజెక్టును వీలైనంత వేగంగా పూర్తిచేయడంపై దృష్టిపెట్టాలని సీఎం సూచించగా...డీపీఆర్‌ పూర్తయ్యిందని, త్వరలోనే టెండర్లు పిలుస్తామని అధికారులు తెలిపారు. పోలవరం పవర్‌ప్రాజెక్టు పనులూ వేగంగా జరుగుతున్నాయని, ఇప్పటికే టన్నెల్స్‌ తవ్వకం పూర్తైదన్న అధికారులు..దీని వల్ల పెద్ద ఎత్తున మిగులు విద్యుత్‌ సాధించగలుగుతామని పేర్కొన్నారు.

జెన్‌కో ఆధ్వర్యంలోని విద్యుదుత్పత్తి ప్లాంట్లను 85 శాతం పీఎల్​ఎఫ్ సామర్థ్యంతో నడిపేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు. పంప్ట్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులపై దృష్టి సారించాలన్నారు. పారిశ్రామిక రంగానికి నిరంతర విద్యుత్తు సరఫరాపై మళ్లీ చర్యలు తీసుకోవాలన్న సీఎం.. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల పరిస్థితులు రాకుండా చూడాలన్నారు. పారిశ్రామిక డిమాండ్‌కు తగినట్టుగా విద్యుత్ సరఫరా చేయాలని.., ఈ విషయంలో పారిశ్రామిక రంగ వ్యక్తులతో కలిసి ఒక కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. వచ్చే వేసవిలో ఇలాంటి సమస్యలు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. ఉచిత విద్యుత్ డబ్బును రైతుల ఖాతాలకే నేరుగా చెల్లించి.. వారి ద్వారా డిస్కంలకు చెల్లించేలా ఏర్పాటు చేయాలని సీఎం నిర్దేశించారు. తద్వారా జవాబుదారీతనం పెరుగుతుందన్నారు.

ఈ దిశగా శ్రీకాకుళంలో చేపట్టిన పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమైందని అధికారులు సీఎంకు వివరించారు. ఉచిత విద్యుత్తు కనెక్షన్లకు మీటర్లు అమర్చామని.., రైతుల ఖాతాలనుంచే చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు. 2020–21 ఆర్థిక సంవత్సరంలో శ్రీకాకుళం జిల్లాలో 26 వేల 83 కనెక్షన్లకు 101.51 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఖర్చైందన్న అధికారులు.. 2021– 22 ఆర్థిక సంవత్సరంలో కనెక్షన్లు 28,393కు పెరిగాయని.., అయినా 67.76 మిలియన్‌ యూనిట్ల కరెంటు మాత్రమే వినియోగించారని అధికారులు తెలిపారు. సంస్కరణల వల్ల 33.75 మిలియన్‌ యూనిట్ల కరెంటు ఆదా అయ్యిందని, రైతులకూ నాణ్యమైన విద్యుత్తు అందుతోందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమీక్షకు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ బి.శ్రీధర్ సహా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.\

ఇదీ చదవండి: పదో తరగతి పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ వైఫల్యం: నక్కా ఆనంద్ బాబు

Last Updated : May 4, 2022, 8:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.