ETV Bharat / city

'చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్ల యూనిట్లు ఇవ్వాలి' - CM Jagan Latest News

చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్ల యూనిట్లు ఇవ్వాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. పథకాన్ని మెరుగ్గా అమలు చేసేందుకు కార్యాచరణను రూపొందించాలని స్పష్టం చేశారు. సూక్ష్మ సేద్యం పరికరాలను రివర్స్ టెండరింగ్ ద్వారా కొనుగోలు చేయాలని సూచించారు. రైతు భరోసా కేంద్రాల్లో సేంద్రీయ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని.. సంబంధించిన పరికరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.

జగన్​మోహన్ రెడ్డి సమీక్ష
జగన్​మోహన్ రెడ్డి సమీక్ష
author img

By

Published : Apr 6, 2021, 9:54 PM IST

వ్యవసాయ, అనుబంధ శాఖలపై ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి సమీక్షించారు. ఉద్యానవన శాఖ, బిందు సేద్యం, అగ్రి ఇన్‌ఫ్రాలపై అధికారులతో చర్చించారు. నిర్ణీత కాలంలోగా చిన్న, సన్నకారు రైతులు అందరికీ డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు బోర్లు వేయిస్తున్నాం కాబట్టి, సూక్ష్మసేద్యం సదుపాయాలను ఇస్తే మంచి ఫలితాలు వస్తాయని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ అందాలని, శాచ్యురేషన్‌ పద్ధతిలో వీటిని అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. వ్యవస్థలో అవినీతి ఉండకూడదన్న సీఎం.. చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న విషయంపై కార్యాచరణ ఉండాలన్నారు. రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్‌ సదుపాయాల్లో ప్రాముఖ్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఈ విషయంపై పూర్తిస్థాయిలో ఆలోచనలు చేసి కార్యాచరణ రూపొందించాలని స్పష్టం చేశారు.

సూక్ష్మసేద్యం సదుపాయాలను రివర్స్ ‌టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేస్తే... రేటు తగ్గుతుందని, ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంటుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే, ఎంత రేటులో డ్రిప్, స్ప్రింక్లర్‌ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయనే దానిపై ఒక అవగాహన వస్తుందని వివరించారు. ప్రస్తుతం మల్బరీని సాగుచేస్తున్న రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టిపెట్టాలన్న సీఎం... వారి పరిస్థితులను పూర్తిస్థాయిలో మెరుగుపరచాలన్నారు.

అగ్రీ ఇన్‌ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్సస్‌ ఫెసిలిటీ సెంటర్లపై ముఖ్యమంత్రి జగన్ సమీక్షించారు. దాదాపు 14 రకాల సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ఫ్లాట్​ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, యంత్రపరికరాలు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఈ-మార్కెటింగ్, జనతా బజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు తదితర సదుపాయాలు కల్పించాలని సూచించారు. వీటి కోసం దాదాపు 14 వేల 562 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ప్రతి రైతుభరోసా కేంద్రంలోనూ సేంద్రీయ, సహజ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఇందుకు సంబంధించిన పరికరాలను ప్రతి కస్టమ్ హైరింగ్‌ సెంటర్​లో ఉంచాలని స్పష్టం చేశారు.

ఇదీ చదవండి:

పరిషత్ ఎన్నికల వాయిదాపై హౌస్​ మోషన్ పిటిషన్ వేస్తాం: కొడాలి నాని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.